సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్తగూడెంలో 36వ షోరూంను ప్రారంభించించింది. స్థానికంగా కొత్తగూడెం.. పరిసరాలలోను నివసించే వారి సరికొత్త జీవన శైలికి, వ్యక్తిగత అభిరుచులకు అచ్చంగా సరితూగే షాపింగ్ అవసరాలను, వైవిధ్యభరిత వస్త్రాలను సాటిలేని నాణ్యతతో.. సరసమైన ధరలకు విక్రయించటంతో పాటు అద్భుతమైన షాపింగ్ అనుభూతిని సైతం అందించగలదు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి కొత్తగూడెం స్థానిక ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక మహిళ కడుపులో పెరుగుతున్న బిడ్డ లోపల పిండం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అల్ట్రాసౌండ్ పరీక్ష తర్వాత వైద్యులు ఈ విషయం తెలుసుకున్నారు. కాగా.. ఆ మహిళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది.
భారతదేశం నుండి అక్రమంగా తరలించబడిన అమూల్యమైన పురాతన వారసత్వాలను అమెరికా ఇండియాకు తిరిగి ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఈ 297 పురాతన వస్తువులను ప్రధాని మోడీకి అందజేశారు. దీంతో.. 2014 నుండి భారతదేశం నుండి స్వాధీనం చేసుకున్న పురాతన వస్తువుల మొత్తం సంఖ్య 640కి పెరిగింది.
బంగ్లాదేశ్‌పై టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలి టెస్టులో భారత్ 280 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతేకాకుండా.. భారత జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారిగా టెస్టు క్రికెట్‌లో ఓడిన దానికంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది.
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌లో ఓ యువకుడు గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
యూపీలోని మహోబాలో ఓ సంచలన కేసు వెలుగు చూసింది. బర్త్‌డే పార్టీ పేరుతో ఇద్దరు స్నేహితులు ఎల్‌ఎల్‌బీ విద్యార్థినిని హోటల్‌కు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడుతామని బెదిరించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులిద్దరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
గ్రేట్ ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ తన క్రికెట్ కెరీర్ ప్రారంభంలోనే చెత్త రికార్డును క్రియేట్ చేశాడు. 2007లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ కొట్టిన ఆరు సిక్స్‌లను క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. ఆ విధ్వంసానికి గురువారంతో 17 ఏళ్లు. ఈ క్రమంలో బ్రాడ్ స్పందించాడు. అంపైర్ నో బాల్ ఇస్తే.. యువరాజ్ ఏడు సిక్సర్ కొట్టేవాడని బ్రాడ్ చెప్పాడు.
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సైబర్ దుండగులు వివిధ మార్గాల్లో ప్రజలను ట్రాప్ చేస్తున్నారు. మౌయిమా ప్రాంతంలో కొత్త కేసు వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఫేస్‌బుక్‌లో ఒక వినియోగదారు.. ధనిక కుటుంబాలకు చెందిన అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేస్తే రూ. 5 లక్షల జీతంతో ఉద్యోగం ఇస్తానని తెలిపాడు. ఈ ఆఫర్ చూసి ఓ యువకుడు ట్రాప్‌లో పడ్డాడు.
యూపీలోని ఇటావాలో అత్తమామల వేధింపులకు ఓ యువకుడు బలయ్యాడు. అత్తమామల వేధింపులతో విసిగిపోయి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసి తన బాధను వ్యక్తం చేశాడు. తన కుటుంబానికి సాయం చేయాలని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, శివపాల్ సింగ్, డీఎంలకు విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.