ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. రోడ్డుకు ఆనుకుని ఉన్న చిత్రగుప్త దేవాలయం గోడ కూలిపోయింది. ఈ సమయంలో అక్కడ రోడ్డు నిర్మాణం పనులు చేస్తున్న కార్మికులపై పడింది. దీంతో.. నలుగురు కూలీలపై శిథిలాలు పడ్డాయి. భారీ శబ్దం రావడంతో.. వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని శిథిలాల నుండి కూలీలను బయటకు తీసి ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఓ కూలీ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన తొలి టెస్టులో భారత డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ మరో అరుదైన ఘనత సాధించాడు. 638 రోజుల తర్వాత అంటే.. అంటే 21 నెలల తర్వాత టెస్ట్ క్రికెట్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన పంత్.. బంగ్లాతో జరుగుతున్న మ్యాచ్‌లో శతకంతో దుమ్ము రేపాడు. భారత్ తరఫున రెండో ఇన్నింగ్స్‌లో 128 బంతుల్లో 109 పరుగులు చేసిన పంత్.. భారత్ తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా నిలిచాడు. దీంతో.. మాజీ కెప్టెన్, దిగ్గజం…
బంగ్లాదేశ్‌తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసింది. బంగ్లాదేశ్‌కు భారత్ 515 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 37.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది.
యూపీలోని మీరట్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. లోహియానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని బాయ్‌ఫ్రెండ్ ఆత్మహత్యకు కారణమని, విద్యార్థినిని మోసపూరితంగా వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఈ వీడియో విద్యార్థి కుటుంబ సభ్యులకు చేరడంతో తీవ్ర మనస్తాపంతో విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
పాఠశాలకు రెండు జడలు వేసుకురాలేదని చిన్నారులపై టీచర్ కిరాతకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గోరఖ్‌పూర్‌లోని ఓ పాఠశాలలో జరిగింది. బాలికలు రెండు జడలు వేసుకరాలేదని ప్రధానోపాధ్యాయురాలు తీవ్ర ఆగ్రహానికి గురై వారిని దారుణంగా చితకబాదింది. దీంతో.. ఓ విద్యార్థి అపస్మార స్థితికి వెళ్లింది.
అక్రమంగా సంపాదించారనే ఆరోపణలపై చైనాలో ఓ మహిళా అధికారికి 13 ఏళ్ల జైలు శిక్ష పడింది. అంతేకాకుండా.. 10 లక్షల యువాన్లు (సుమారు రూ. 1.18 కోట్లు) జరిమానా విధించారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. ఝాంగ్ యాంగ్ గుయిజౌ కియానాన్ ప్రావిన్స్‌కు గవర్నర్‌గా ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ)లో డిప్యూటీ సెక్రటరీగా కూడా పనిచేశారు.
ఓ మహిళ బైక్ పై ఎలివేటెడ్ రోడ్డుపై వెళ్తుండగా కారు వచ్చి ఢీకొట్టింది. దీంతో.. యువతి ఎలివేటెడ్ రోడ్డుపై నుంచి కిందపడి ఎలివేటెడ్ రోడ్డు పిల్లర్‌పై ఇరుక్కుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆమెను రక్షించేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. చివరకు సురక్షితంగా కిందకు దించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో చాలా మంది వ్యక్తులు పిల్లర్ పై చిక్కుక్కున్న యువతిని రక్షించడానికి ప్రయత్నించినట్లు ఉంది.
లెబనాన్‌లో పేజర్ పేలుడు ఘటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సంఘటనకు సంబంధించి ముఖ్యమైన వ్యక్తిగా 49 ఏళ్ల విదేశీ మహిళ పేరు వినిపిస్తోంది. ఈ మహిళ హంగేరీకి చెందినది. ఆమె పేరు క్రిస్టియానా బార్సోనీ. క్రిస్టియానా బుడాపెస్ట్‌లోని BAC కన్సల్టింగ్‌కు CEOగా వ్యవహరిస్తోంది.
బంగ్లాదేశ్‌తో జరిగిన చెన్నై టెస్టులో టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ టెస్టుల్లో 5వ సెంచరీ సాధించాడు. 119 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో గిల్ 10 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సిక్సర్ల మార్కును కూడా దాటేశాడు.
శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో ఇన్నింగ్స్‌లో డీఆర్‌ఎస్ తీసుకోకుండా విరాట్ కోహ్లీ పెద్ద తప్పు చేశాడు. చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 36 బంతుల్లో 17 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో.. మెహదీ హసన్ మిరాజ్ వేసిన ఫుల్ డెలివరీ తప్పి బంతి ప్యాడ్‌కు తగిలింది. ఆలస్యం చేయకుండా అంపైర్ అప్పీల్‌ను అంగీకరించి ఔట్ ఇచ్చాడు. ఆ సమయంలో.. తోటి బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌తో మాట్లాడి రివ్యూ తీసుకోకూడదని కోహ్లీ నిర్ణయించుకున్నాడు.…