రేణుకాస్వామి హత్యకేసులో ముగ్గురు నిందితులకు షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది. అంతేకాకుండా.. వారిపై హత్యానేరం ఎత్తివేసింది. నిందితుడు కేశవ్ మూర్తికి కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరో ఇద్దరు నిందితులు కార్తీక్, నిఖిల్‌లకు కూడా బెంగళూరు సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
30 ఏళ్ల కానిస్టేబుల్‌తో 45 ఏళ్ల మహిళ అదృశ్యమైన ఘటన యూపీలోని భాదోహిలో చోటు చేసుకుంది. బీజేపీ తరపున చైర్మన్ ఎన్నికకు పోటీ చేసిన ఓ బీజేపీ నాయకురాలిగా గుర్తించారు. అయితే.. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న కానిస్టేబుల్‌తో కలిసి జంప్ అయింది. ఆ మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 25 ఏళ్ల కూతురు, ఏడేళ్ల కొడుకు ఉన్నారు. తనతో పాటు తన కొడుకును తీసుకుని పారిపోయింది.
శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన అనుర కుమార దిసానాయకేకి ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ 'X' ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో.. సోమవారం దిసానాయక్ స్పందిస్తూ.. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు
భారత్‌లో కొత్త వేరియంట్ కలకలం రేపుతుంది. మంకీపాక్స్ క్లాడ్ 1బి మొదటి కేసు నమోదైంది. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు సోమవారం ధృవీకరించాయి. గత నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన మంకీపాక్స్ జాతి అని అధికారులు తెలిపారు. ఈ Mpox క్లాడ్ 1B వేరియంట్ కేసు కేరళకు చెందిన ఒక వ్యక్తిలో కనుగొన్నారు.
బీజేపీలో చేరాల్సిందిగా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఆహ్వానంపై సిర్సా ఎంపీ కుమారి సెల్జా స్పందించారు. ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడిన శైలజ.. కాంగ్రెస్ రక్తం తన సిరల్లో ఉందని అన్నారు. తాను కాంగ్రెస్‌వాదిగానే ఉంటానని సూటిగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి వైరం లేదని అన్నారు. రానున్న కాలంలో హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుందని తెలిపారు.
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏకనాథ్ షిండే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం ఏక్‌నాథ్ షిండే అధ్యక్షతన ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో పూణె విమానాశ్రయం పేరును మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో పూణె విమానాశ్రయం పేరు మార్చారు. 'జగద్గురు సంత్ తుకారాం మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం'గా నిర్ణయించారు.
లౌకికవాదం పేరుతో భారతదేశ ప్రజలకు "మోసం" జరిగిందని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆరోపించారు. సెక్యులరిజం యూరోపియన్ భావన.. అది భారతదేశంలో అవసరం లేదని తమిళనాడు గవర్నర్ పేర్కొన్నారు. ఆదివారం కన్యాకుమారిలో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగిస్తూ.. ‘‘ఈ దేశ ప్రజలపై ఎన్నో మోసాలు జరిగాయి,
టెస్ట్ క్రికెట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన ఆటగాళ్లలో ఒక్క భారత ఆటగాడి పేరు లేదు. వీరేంద్ర సెహ్వాగ్, రిషబ్ పంత్ వంటి భారీ హిట్టర్స్ ఉన్నప్పటికీ.. టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన జాబితాలో లేరు. భారత ఆటగాళ్ల పేరిట ఎన్నో అరుదైన రికార్డులున్నప్పటికీ, ఈ రికార్డు లేకపోవడం గమనార్హం.
క్రికెట్లో రికార్డులు బ్రేక్ అవుతూనే ఉంటాయి. ఎంతోమంది దిగ్గజాల రికార్డును బద్దలు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ బ్యాటర్ రికార్డును బ్రేక్ చేయడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఇంతకీ ఆ బ్యాటర్ ఎవరనుకుంటున్నారా..? వెస్టిండీస్ క్రికెటర్, మాజీ కెప్టెన్ నికోలస్ పూరన్.. అంతకుముందు.. అత్యధిక టీ20 సిక్సర్లు బాదిన ప్రపంచ రికార్డు కరీబియన్ బ్యాట్స్‌మెన్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. 2015లో గేల్ 135 సిక్సర్లు కొట్టాడు. అయితే.. ఆ రికార్డును తొమ్మిదేళ్ల తర్వాత తమ దేశ ఆటగాడు నికోలస్ పూరన్…
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. తనతో పాటు కార్యక్రమంలో మరో కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే పాల్గొన్నారు. ఈ క్రమంలో తనను ఉద్దేశించి సరదాగా కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎన్డీయే నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న గ్యారెంటీ లేదని.. కానీ రాందాస్ అథవాలే మంత్రి కావడం ఖాయమని గడ్కరీ అన్నారు.