రాంచీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తేనెటీగల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ఒక మహిళ, ముగ్గురు పిల్లలు మృతి చెందారు. మృతురాలు భర్త సునీల్ బార్లా తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 21 (శనివారం) తన భార్య జ్యోతి గాడి తన తల్లి గారింటికి వెళ్లింది. ఈ క్రమంలో.. ఇంటికి సమీపంలోని ఓ బావిలో స్నానం చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని తెలిపాడు.
పాముకాటుతో 22 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. అనంతరం.. అతని చితిపైనే కాటేసిన పామును సజీవ దహనం చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం రోజు ఈ ఘటన జరిగింది. అయితే స్థానికులు.. పాము మరొకరికి హాని చేస్తుందనే భయంతో దానిని చితిపై కాల్చారు.
చైనాలో నెబ్యులా-1 అనే రాకెట్ బ్లాస్ట్ అయింది. ప్రయోగం సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రాకెట్ చైనాకు చెందిన డీప్ బ్లూ ఏరోస్పేస్ కంపెనీకి చెందినది. ఈ రాకెట్ టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. అయితే మిషన్ కోసం నిర్దేశించిన 11 లక్ష్యాలలో 10 సాధించినట్లు కంపెనీ తెలిపింది.
ఆదివారం ఇరాన్‌లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకేజీ కారణంగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 51 మంది మృతి చెందారు. అంతేకాకుండా.. 20 మంది గాయపడ్డారు. గత కొన్నేళ్లుగా దేశంలో జరిగిన ఘోర ప్రమాదాల్లో ఇదొకటి అని ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఇరాన్‌లోని దక్షిణ ఖొరాసన్ ప్రావిన్స్‌లో ఈ పేలుడు సంభవించింది.
గాజా నగరంలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఏడుగురు మృతి చెందారు. ఈ వ్యక్తులు తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసమని పాఠశాలలో ఆశ్రయం పొందుతున్నారు. కాగా.. ఈ ఘటనపై పాలస్తీనా అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే.. పాఠశాల ఆవరణలో తలదాచుకున్న వారిని చంపేందుకు లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది.
బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న చెస్ ఒలింపియాడ్ 2024లో భారత్ చరిత్ర సృష్టించింది. చెస్ ఒలింపియాడ్ లో తొలిసారి రెండు గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఓపెన్ సెక్షన్‌లో గ్రాండ్ మాస్టర్ డీ గుకేష్ అద్భుత ప్రదర్శన చేసి తొలి బంగారు పతకం గెలుచుకోగా.. అనంతరం మహిళ జట్టు కూడా మరో స్వర్ణం సాధించి భారత్ చరిత్ర లిఖించింది.
దులీప్ ట్రోఫీ 2024 టైటిల్‌ను ఇండియా 'A' కైవసం చేసుకుంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఇండియా ఏ రెండింట్లో విజయం సాధించగా.. ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. రెండు విజయాలతో ఈ జట్టు గరిష్టంగా 12 పాయింట్లను కలిగి ఉంది. దీంతో.. జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. భారత్ సి 9 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. కాగా.. భారత్ ఎ జట్టు 61వ సారి దులీప్ ట్రోఫీ టైటిల్ గెలుచుకుంది.
అతని టెస్టు కెరీర్‌లో ఇది ఆరో సెంచరీ. అయితే.. తొలి టెస్ట్ మ్యాచ్ మూడవ రోజు ఆట ప్రారంభానికి ముందు ఆయుధ పూజ చేశాడు. తన బ్యాట్, గ్లౌజులను టేబుల్ పై ఉంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా మొక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ సెంచరీతో చెలరేగడం గమనార్హం. దీంతో.. పంత్ పూజలు ఫలించాయని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
యూపీ రాజధాని లక్నోలో ఓ కంత్రీ కొడుకు బరి తెగించాడు. డబ్బుల కోసం తన తండ్రికే స్కెచ్ వేశాడు. తన తండ్రి నుంచి రూ. 2 కోట్లు లాగేందుకు తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ నాటకం ఆడాడు. తన స్నేహితులకు స్టోరీనంతా చెప్పి.. రూ. 2 కోట్లు ఇవ్వాలంటూ ఓ మెస్సెజ్ పంపించారు.
నోయిడాలోని రబుపురా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం ఆయన తన భార్యతో వీడియో కాల్‌లో మాట్లాడుతుండగా గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మహ్మద్‌పూర్ గ్రామం సమీపంలో పోలీస్ స్టేషన్ జీపులో ప్రభుత్వ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు