బీరుట్ సబర్బన్ ప్రాంతాలలో ఇజ్రాయెల్ దాడిలో 8 మంది చనిపోయారు.. 59 మంది గాయపడినట్లు వెల్లడించారు. చనిపోయిన వారిలో ఓ అగ్ర సైనికుడు ఉన్నాడు. కాగా.. ఇజ్రాయెల్ లెబనాన్‌లోని హిజ్బుల్లా లక్ష్యాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే..
పోలీసులు తనను వేధించిన విషయాన్ని ఓ బాధితురాలు వెల్లడించింది. ఆ రాత్రి పోలీస్ స్టేషన్‌లో బాధితురాలిపై పోలీసు సిబ్బంది చేసిన అమానుష ప్రవర్తన వింటే మీరు కూడా షాక్ అవుతారు.
జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) బస్సు కాలువలో పడిపోవడంతో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. పలువురు జవాన్లకు గాయాలయ్యాయి.
సాధారణంగా కిడ్నీలలో రాళ్లంటే చిన్నచిన్నవి ఉంటాయి. కానీ.. దాదాపు కిడ్నీ మొత్తం ఆవరించి, బయట కటివలయంలోకి కూడా వచ్చిన దుప్పికొమ్ము ఆకారంలోని రాయి ఉండడం చాలా తీవ్రమైన సమస్య. దాదాపు 80 మి.మీ. కంటే పొడవున్న ఈ రాయి ఇంచుమించు కిడ్నీ ఆకారంలోనే పెరగడంతో మూత్రనాళానికి అడ్డం పడదు, దాంతో నొప్పి తెలియదు, వాపు కూడా అంతగా ఉండదు. అందువల్ల రోగులకు ఇది ఉందనే విషయమే తెలియదు. ఇలాంటి తీవ్రమైన సమస్యను అత్యున్నత సాంకేతిక నైపుణ్యంతో తొలగించారు విశాఖపట్నంలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ…
ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య యుద్ధం తీవ్రతరంగా మారుతోంది. శుక్రవారం.. లెబనాన్‌లోని హిజ్బుల్లా, ఉత్తర ఇజ్రాయెల్‌పై ఒకదాని తర్వాత ఒకటి మూడు దాడులు చేసింది. ఈ మూడు దాడుల్లో హిజ్బుల్లా ఉగ్రవాదులు దాదాపు 140 క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడుల్లో జరిగిన నష్టం ఎంతనేది తెలియరాలేదు.
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆరుగురు పాక్ సైనికులు మరణించారు. రాత్రి అకస్మాత్తుగా జరిగిన ఈ ఉగ్రదాడిలో దాదాపు 11 మంది సైనికులు గాయపడినట్లు సమాచారం. ఈ దాడుల్లో 12 మంది ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఈ దాడికి పాల్పడింది.
కలోంజి గింజలు (నల్ల జీలకర్ర) అందరి ఇళ్లలో వంటగదిలో ఉంటాయి. ఇవి ఆహార రుచిని రెట్టింపు చేయడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కలోంజి గింజల నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. కలోంజి గింజలు తీసుకోవడం వల్ల శరీరంలోని అనేక సమస్యలు తొలగిపోవడంతో పాటు వ్యాధులు కూడా దూరమవుతాయి.
బంగ్లాదేశ్‌తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్ (33*), రిషబ్ పంత్ (12*) ఉన్నారు. భారత్ 308 పరుగుల ఆధిక్యంలో ఉంది.
బంగ్లాదేశ్‌తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన పేరు మీద రికార్డు రాసిపెట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన భారత్ తరఫున 10వ బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. అంతే కాకుండా.. అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు పూర్తి చేసిన ఘనత సాధించిన ఆరో భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా.
కరోనా వైరస్ కొత్త వేరియంట్ XEC కలవరపెడుతోంది. యూరోపియన్ దేశాలలో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ కేసుల పెరుగుదల అధికంగా నమోదవుతోంది. పలు దేశాల్లో కరోనావైరస్ కొత్త వేరియంట్ XEC కేసులు వేగంగా పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. త్వరలోనే ఇది ఆధిపత్య మహమ్మారిగా రూపాంతరం చెందే అవకాశం ఉందని నిపుణులు వెల్లడించారు.