UP: బర్త్‌డే పార్టీకి తీసుకెళ్లి.. విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
- యూపీలోని మహోబాలో ఓ సంచలన కేసు
- బర్త్‌డే పార్టీ పేరుతో ఇద్దరు స్నేహితులు ఎల్‌ఎల్‌బీ విద్యార్థినిని అత్యాచారం
- అత్యాచార వీడియోను సోషల్ మీడియాలో పెడుతామని బెదిరింపులు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి తండ్రి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని మహోబాలో ఓ సంచలన కేసు వెలుగు చూసింది. బర్త్‌డే పార్టీ పేరుతో ఇద్దరు స్నేహితులు ఎల్‌ఎల్‌బీ విద్యార్థినిని హోటల్‌కు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడుతామని బెదిరించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులిద్దరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: Alcohol: మద్యం ప్రియులూ.. మందు తాగేటప్పుడు ఈ స్టఫ్ తినండి..శరీరానికి మంచిది
Also Read
- Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
- Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
- Geetu Mohandas: "నేను రాసిందొకటి.. తీసిందొకటి".. టాక్సిక్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. కానీ..
- OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
సెప్టెంబరు 4న తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటానని చెప్పి తన కుమార్తె, స్నేహితుడు ఆదిత్య సింగ్ లా కాలేజీ నుంచి తీసుకెళ్లాడని బాధితురాలి తండ్రి పోలీసులకు తెలిపాడు. చరఖారీ బైపాస్‌లో ఉన్న ఓ హోటల్‌కి తీసుకెళ్లగా.. అక్కడికి ఆదిత్య స్నేహితుడు సమీర్ కూడా వచ్చాడు. ఆ తర్వాత ఆదిత్య, సమీర్‌లు తన కూతురిని బెదిరించి అత్యాచారం చేసి అభ్యంతరకరంగా వీడియో తీశారని పోలీసులకు చెప్పాడు. బాధితురాలు స్పృహలోకి రాగానే ఇద్దరూ తన కూతురిని కాలేజీలో వదిలి వెళ్లిపోయారని అన్నాడు. ఈ విషయం గురించి ఎవరికైనా చెప్తే వీడియో వైరల్ చేస్తానని బెదిరించారని బాధితురాలి తండ్రి పోలీసులకు తెలిపాడు.
Read Also: Pune murder: ప్రియుడి సాయంతో భర్తను చంపిన భార్య.. ఏం కట్టుకథ అల్లిందంటే..!
తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన జరిగిన తర్వాత తన కుమార్తె కళాశాలకు వెళ్లడం మానేసి ఇంట్లోనే ఉంటుందని అన్నాడు. ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించగా తన బాధను చెప్పిందని.. నిందితులు పంపిన వీడియోను కూడా చూపించిందని తండ్రి చెప్పాడు. ఈ క్రమంలో.. పోలీసులు నిందితులు ఆదిత్య, సమీర్‌లపై ఎస్సీ-ఎస్టీ చట్టం కింద అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Ranabaali Release Date: రష్మికతో కలిసి విజయ్ విశ్వరూపం.. అక్టోబర్ 16న వరల్డ్‌వైడ్‌గా ‘రణబాలి’ గ్రాండ్ రిలీజ్!
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Mandadi Teaser: ‘మండాడి’ టీజర్ చూశారా? సుహాస్, సూరి ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది!
-
Dean Elgar Retirement: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన దక్షిణాఫ్రికా స్టార్.. విరాట్ కోహ్లీతో వివాదం గుర్తుందా?
-
Toxic vs Irumudi : టాక్సిక్ టాక్.. ఇరుముడికి తిరుగులేదు
ట్రెండింగ్
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!