సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం, నామినేటెడ్ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. ఈ క్రమంలో.. రేపటి నుంచి ప్రారంభమయ్యే సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సీఎం చంద్రబాబు చర్చించారు. రేపు టీడీపీ సభ్యత్వ కార్యక్రమాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షులు, సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
బంజారాహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించారు.
అత్తాపూర్ మూసీ పరీవాహక ప్రాంతంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చేసేది పేదల కోసం కాదు.. డబ్బు సంచుల కోసం, బ్లాక్ మెయిలింగ్ కోసమని ఆరోపించారు. తాము ప్రజల పక్షాన మాట్లాడుతుంటే.. నడమంత్రపు సిరితో ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడవద్దని దుయ్యబట్టారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అదనపు మెజిస్ట్రేట్గా మారారు. అదనపు మెజిస్ట్రేట్ హోదాలో కేసులను విచారించారు. హిమాయత్ నగర్‌లో జరిగిన ఎంఐఎం ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత వివాదాన్ని విచారించారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో కిడ్నాపర్లు రెచ్చిపోయారు. హైదర్ గూడలో ఆడుకుంటున్న ఓ చిన్నారిని కిడ్నాప్ చేశారు కిడ్నాపర్లు. కాగా.. అక్కడున్న స్థానికులు గమనించి కిడ్నాపర్లను పట్టుకున్నారు. ఈ క్రమంలో.. వారికి దేహశుద్ధి చేశారు. కిడ్నాపర్లను ఓ స్తంభానికి కట్టేసి చితకబాదారు గ్రామస్తులు.
తెలంగాణలోని ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుంది. రేపు సాయంత్రంలోపు డీఏ (DA)పై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటి వేశారు సీఎం రేవంత్ రెడ్డి.
చెరువులు, నాలాల పరిరక్షణతో పాటు వాటికి పునరుజ్జీవనం కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు, లేక్‌మ్యాన్స్, జలవనరుల అభివృద్ధికి సంబంధించిన పలువురు పరిశోధకులు, నిపుణలతో హైడ్రా సమావేశాలు నిర్వహించింది. గురువారం హైడ్రా కార్యాలయంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో వాటర్-ఉమెన్ రైట్స్ యాక్టవిస్టు డా. మన్సీబాల్ భార్గవతో హైడ్రా బృందం సమావేశమైంది.
ఈరోజు కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. వెంకటేశ్వర్లను రెండు విడతలుగా విచారించింది కమిషన్. రేపు మళ్లీ విచారణకు రావాలని వెంకటేశ్వర్లను కమిషన్ ఆదేశించింది. బహిరంగ విచారణలో వెంకటేశ్వర్లు మాజీ ముఖ్యమంత్రి పేరును పలుసార్లు ప్రస్తావించారు.
కూకట్‌పల్లి ఏసీపీ శ్రీనివాస్ రావు విషయాలు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా మెట్రో స్టేషన్ల కింద మహిళలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని సమాచారం వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో యూనిట్, హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, షీ టీమ్స్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ పోలీసులతో నాలుగు టీంలను ఏర్పాటు చేశామని చెప్పారు. రాత్రి 8 గంటల నుండి 11 గంటల వరకు ఆకస్మిక తనిఖీలు చేశామని వెల్లడించారు. ఈ తనిఖీలలో 31 మంది మహిళలు, యువతులు దొరికారన్నారు. వీరంతా అక్కడి నుండి నడుచుకుంటూ వచ్చే వారి పట్ల సైగలు…
పూణే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 16/1 పరుగులతో ఉంది. క్రీజులో యశస్వీ జైస్వాల్ (6*), శుభ్‌మన్ గిల్ (10*) ఉన్నారు. కాగా.. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 243 పరుగుల ఆధిక్యంలో ఉంది.