Kukatpally ACP: కూకట్‌పల్లిలో ఆన్‌లైన్ వ్యభిచార ముఠా కేసులో ఏసీపీ కీలక విషయాలు..
- కూకట్‌పల్లిలో ఆన్‌లైన్ వ్యభిచార ముఠా కేసులో ఏసీపీ కీలక విషయాలు వెల్లడి
- గత కొద్ది రోజులుగా మెట్రో స్టేషన్ల కింద మహిళలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని సమాచారం వచ్చింది
- నాలుగు టీంలు ఏర్పాటు చేసి గుర్తించాం- ఏసీపీ శ్రీనివాస్ రావు
- రాత్రి 8 గంటల నుండి 11 గంటల వరకు ఆకస్మిక తనిఖీలు చేశాం- ఏసీపీ
- 31 మంది మహిళలు.. యువతులు దొరికారు- ఏసీపీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద బహిరంగంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా ఆగడాలను పోలీసులు గుట్టు రట్టు చేశారు. కూకట్ పల్లి మెట్రో కింద న్యూసెన్స్ చేస్తున్నట్లు గుర్తించారు. మెట్రో స్టేషన్ కింద బహిరంగంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు స్థానిక సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. సోషల్ మీడియాలో కూకట్ పల్లి గర్ల్స్ పేరుతో ముఠా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేసి పెట్టి ముఠా వ్యభిచారం చేస్తున్నట్లు తెలిపారు.
Read Also: AP CM Chandrababu: అమరావతికి రైల్వే లైన్.. ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కృతజ్ఞతలు
Also Read
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
ఈ సందర్భంగా కూకట్‌పల్లి ఏసీపీ శ్రీనివాస్ రావు విషయాలు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా మెట్రో స్టేషన్ల కింద మహిళలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని సమాచారం వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో యూనిట్, హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, షీ టీమ్స్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ పోలీసులతో నాలుగు టీంలను ఏర్పాటు చేశామని చెప్పారు. రాత్రి 8 గంటల నుండి 11 గంటల వరకు ఆకస్మిక తనిఖీలు చేశామని వెల్లడించారు. ఈ తనిఖీలలో 31 మంది మహిళలు, యువతులు దొరికారన్నారు. వీరంతా అక్కడి నుండి నడుచుకుంటూ వచ్చే వారి పట్ల సైగలు చేస్తూ వ్యభిచారానికి ప్రోత్సహిస్తున్నారని ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. వెంటనే వీరిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చామని తెలిపారు.
Read Also: Shocking: డీజే రిపేర్‌కి డబ్బులు ఇవ్వలేదని.. ఫ్రెండ్‌తో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు..
ఈరోజు ఎమ్మార్వో ముందు వీరందరిని బైండోవర్ చేశామని.. వారం రోజులుగా జరిపిన ఈ ఆకస్మిక తనిఖీలలో మొత్తం 54 మందికి పైగా మహిళలు పట్టుబడ్డారని ఏసీపీ వెల్లడించారు. వీరందరికీ అవసరమైన కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. ఇప్పటివరకు రెండుసార్లు పట్టుబడిన వాళ్లలో ఒక మహిళ మాత్రమే ఉంది.. మరోసారి పట్టుబడితే జైలుకు పంపిస్తామని హెచ్చరించామని తెలిపారు. ఈ మహిళల్లో మార్పు తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజలు కూడా ఇలాంటి మిస్ బిహేవ్ చేస్తున్న వాళ్లు కనపడితే వెంటనే డయల్ హండ్రెడ్‌కు కాల్ చేయాలని ఏసీపీ శ్రీనివాస్ రావు అన్నారు.
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!