ఐసీఐసీఐ బ్యాంక్ స్కాంలో కొత్త ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో ఏ1గా ఉన్న నరేష్ చంద్రశేఖర్ మిస్సింగ్ పై కేసు నమోదు అయింది. నరేష్ భార్య సరోజినీ ఫిర్యాదు మేరకు 2 రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదు చేశారు పటమట పోలీసులు. గత నెల 26న హైదరాబాద్ వెళ్ళాడని.. 28న ఫోన్ చేసి డబ్బులు రావల్సిన పని అవటం లేదని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు భార్య ఫిర్యాదు చేసింది.
వైఎస్ జగన్, షర్మిల మధ్య తలెత్తిన ఆస్తుల వివాదంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్‌కు షర్మిల వ్యక్తిగతంగా రాసిన ఉత్తరం కూటమి ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్‌లో ఉంటుందని ఆరోపించారు.
టీడీపీ కుట్రలో షర్మిల పావులా మారిందని వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి పేర్నినానితో కలిసి వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్ జైలుకు వెళ్ళటానికి కాంగ్రెస్, టీడీపీ పెట్టిన అక్రమ కేసులు కారణం అని అన్నారు. ఆ కేసుల్లో భాగంగా ఈడీ విచారణ చేసి ఆస్తులు అటాచ్ మెంట్ చేసింది.. ట్రాన్స్‌ఫర్ చేయద్దు అని హైకోర్టు చెప్పినా షేర్లు ట్రాన్స్‌ఫర్ చేసారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
AP అంటే A ఫర్ అమరావతి, P ఫర్ పోలవరం అనే విధంగా ప్రజలు ఆలోచిస్తున్నారని సమాచార పౌరసంబంధాల శాఖామంత్రి కొలుసు పార్ధసారథి అన్నారు. ఏపీని పెట్టుబడికి అనువైన ప్రాంతంగా పెట్టుబడిదారులు వస్తున్నారని తెలిపారు. రూ. 15 వేల కోట్లు కేంద్రంతో మంజూరు చేయించడం అమరావతి ప్రాజెక్టు పూర్తవుతుందనే నమ్మకం కలిగించిందని మంత్రి పేర్కొన్నారు.
ఉచిత ఇసుక విధానాన్ని మరింత సరళం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఉచిత ఇసుక పాలసీ 2024లో సీనరేజి ఫీజు మాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు మైన్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా జీవో జారీ చేశారు. ఉచిత ఇసుక పాలసీపై ఈ నెల 21న జరిగిన సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయలను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తిరుపతి జిల్లాలో కేంద్రమంత్రి రామ్మోనాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విమానాల్లో బాంబు బెదిరింపులపై మంత్రి స్పందించారు. గత 9 రోజులుగా చాలా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.. వాటిని చాలా సీరియస్‌గా తీసుకున్నాంమని తెలిపారు. బెదిరింపులు ఎక్స్ వేదికగా వస్తున్నాయి.. కానీ అవన్నీ ఫేక్ అని తెలుతున్నాయని అన్నారు.
పుణే టెస్టులోనూ టీమిండియాకు కష్టాలు తప్పలేదు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 156 పరుగులకే కుప్పకూలగా... రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ భారీ ఆధిక్యంపై కన్నేసింది. కాగా.. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్సింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. దీంతో.. భారత్‌పై న్యూజిలాండ్ 301 పరుగుల ఆధిక్యం సాధించింది.
కళియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల దివ్యక్షేత్రంలో నిత్య అన్న ప్రసాద ట్రస్టుకు విజయవాడకు చెందిన ఎక్సెల్లా (Exxeella) ఎడ్యుకేషన్ గ్రూప్ చైర్మన్ అరసవిల్లి అరవింద్ రూ. 10 లక్షల చెక్కును టీటీడీకి అందించారు.
మెన్ ఫర్ ఉమెన్ పేరుతో స్టార్ హాస్పిటల్స్ ప్రత్యేక చొరవ చూపుతుంది. ఆ వ్యాధి నుంచి బయటపడిన వారితో కార్యక్రం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి సినీ హీరో శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో.. స్టార్ హాస్పిటల్స్ అందించిన చికిత్స వివరాలను గురించి వెల్లడించనున్నారు.
విజయవాడలోని ఇరిగేషన్ మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ల సీఈ, ఎస్ఈలతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. సాయిప్రసాద్, ఈఎన్సీ ఎం. వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువల అత్యవసర పనుల నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసిన రూ. 284 కోట్లతో వెంటనే పనులు చేపట్టాలని మంత్రి ఆదేశం ఇచ్చారు.