హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రామంతాపూర్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంది. బిల్డింగ్ పై నుండి దూకి సూసైడ్ కు పాల్పడింది. అయితే.. ఈ ఘటనకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. ఆత్మహత్యకు పాల్పడ్డ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హరితగా గుర్తించారు. ఆమె.. రామంతాపూర్‌లోని DSL మాల్‌లో ఉద్యోగం చేస్తుంది.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడి హత్యపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. సొంత అనుచరుడు హత్యకు గురి కావడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మనస్థాపానికి గురి అయ్యారు.. జీవన్ రెడ్డి బాధలో ఉండి అలా మాట్లాడారని తెలిపారు. తాను జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడనని.. పోలీసులతో మాట్లాడినట్లు చెప్పారు. హత్య చేసిన నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు.. హత్యపై విచారణ చేసి నిందితున్ని కఠినంగా శిక్షించాలని పోలీసులకు చెప్పానన్నారు.
పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్ ఆసియా కప్ 2024 రెండో మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో యూఏఈపై విజయం సాధించింది. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ తుఫాను బ్యాటింగ్, రసిక్ సలామ్ అద్భుత బౌలింగ్‌తో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 107 పరుగులకే ఆలౌటైన యూఏఈ.. అనంతరం లక్ష్య చేధనలో భారత్ 10.5 ఓవర్లలో 108 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించింది. భారత్ బ్యాటింగ్‌లో టీమ్‌ఇండియా ఓపెనర్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ.. క్రీజులోకి వచ్చిన వెంటనే దూకుడు బ్యాటింగ్ చేశాడు. దీంతో..…
సంగారెడ్డిలో అధికారులు రూల్స్ అతిక్రమిస్తున్నారు. వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి లైన్‌లో పెట్టాల్సిన అధికారులే రూల్స్ తప్పుతున్నారు. ఓవర్ స్పీడ్‌తో వెళ్లడమే కాకుండా.. ట్రాఫిక్ చలాన్లను ఎగ్గొడుతున్నారు. ఈ వ్యవహారం సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు.. సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్ వరకు ఇదే తీరుతో వ్యవహరిస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ పిటిషన్ పై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. అయితే.. నేడు తీర్పు వెలువడుతుందని అనుకున్నప్పటికీ.., తీర్పు వాయిదా పడింది.
నగర పరిధిలోని చెరువల ఆక్రమణలను తొలగించిన హైడ్రా ఇప్పుడు.. ఆయా చెరువుల పునరుజ్జీవనంపై దృష్టి సారించింది. నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతీనగర్‌కు చేరువలో ఉన్న ఎర్రకుంట చెరువుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అధికారులు.
హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై గవర్నర్, డీజీపీలను బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిశారని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని ఆరోపించారు.
రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి ఇంట్లో ఏసీబీ మెరుపు దాడులు చేసింది. ఆదానికి మించిన ఆస్తుల కేసులో భూపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. భూపాల్ రెడ్డికి సంబంధించిన ఐదు చోట్ల ఏసీబీ సోదాలు జరిపింది. ఈ క్రమంలో.. 40 కోట్ల రూపాయల వరకు అక్రమాసులను గుర్తించింది ఏసీబీ..
స్పీకర్ ఛాంబర్, మండలి భవనం మరమ్మత్తులపై మంత్రులు సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్‌లు రామచంద్ర నాయక్, ఆది శ్రీనివాస్, రహదారులు భవనాల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇప్పటివరకు జరిగిన పనులపై స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు రివ్యూ చేశారు.
భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత బ్యాటింగ్‌తో 2024 మహిళల టీ20 ప్రపంచ కప్ 'టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్'లో చోటు దక్కించుకుంది. ఈ 'టీమ్ ఆఫ్ టోర్నీ'లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి తొలి మహిళల టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. టీ 20 వరల్డ్ కప్‌లో భారత్.. సెమీ-ఫైనల్‌కు చేరుకోపోయినప్పటికీ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మాత్రం అద్భుత ప్రదర్శన చేసింది.