శనివారం క్రికెట్ ప్రపంచంలో రెండు పెద్ద సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకవైపు.. 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి టెస్ట్ సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది పాకిస్తాన్. మరోవైపు.. 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రెండవ మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి కైవసం చేసుకుంది.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కోమాకి.. కొత్త మోడల్ క్యాట్ 3.0 ఎన్‌ఎక్స్‌టిని పరిచయం చేసింది. CAT 3.0 NXT యొక్క కొత్త మోడల్ గ్రాఫేన్, LIPO4 అనే రెండు బ్యాటరీ వేరియంట్‌లను తీసుకు వస్తుంది.
టామ్ లాథమ్ సారథ్యంలోని న్యూజిలాండ్ జట్టు భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. పుణెలో శనివారం జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 113 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. భారత గడ్డపై తొలిసారిగా న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో.. షాన్ మసూద్ సారథ్యంలో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.
OnePlus 13 అక్టోబర్ 31న చైనాలో లాంచ్ కానుంది. కాగా.. ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించి ఫీచర్లు ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. అధికారికంగా డిస్‌ప్లే యొక్క కొన్ని ప్రత్యేక లక్షణాలను వెల్లడించింది. ఈ ఫోన్ శక్తివంతమైన డిస్‌ప్లేతో రానుంది. కళ్లను రక్షించడానికి అనేక సాంకేతికతలతో తయారు చేశారు.
రాష్ట్రంలో అతిపెద్ద సమస్యగా ఉన్న చెత్త తొలగింపు ప్రక్రియను యుద్ద ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేసి.. చెత్త తొలగించని కారణంగా 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త మిగిలిందని.. దీన్ని వచ్చే జూన్ నాటికి పూర్తిగా తొలగించాలని సీఎం సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ అమలు వేగవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్ మొదటి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది అని మంత్రి లోకేష్ చెప్పారు.. ఎస్సీ వర్గీకరణ ప్రారంభం అయ్యేవరకు ఎటువంటి జాబ్ నోటిఫికేషన్‌లు ఇవ్వకూడదని అన్నారు.
విశాఖ హనీట్రాప్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కస్టడీలోకి తీసుకున్న కిలాడీ జెమిమా నుండి కీలక ఆధారాలు స్వాధీనం పరుచుకున్నారు పోలీసులు. జెమిమాకు చెందిన మిగతా మొబైల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో కీలక వ్యక్తుల డేటా లభ్యం అయినట్లు సమాచారం.