HYDRA: చెరువుల అనుసంధానంతోనే వరదకు కట్టడి..
- వాటర్-ఉమెన్ రైట్స్ యాక్టవిస్టు డా. మన్సీబాల్ భార్గవతో హైడ్రా బృందం సమావేశం
- నగరంలో చెరువుల పరిస్థితిపై సమీక్ష
- వాటికి పునరుజ్జీవనం కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించిన హైడ్రా కమిషనర్
- హైడ్రా చర్యలపట్ల హర్షం వ్యక్తం చేసిన డా. మన్సీబాల్ భార్గవ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెరువులు, నాలాల పరిరక్షణతో పాటు వాటికి పునరుజ్జీవనం కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు, లేక్‌మ్యాన్స్, జలవనరుల అభివృద్ధికి సంబంధించిన పలువురు పరిశోధకులు, నిపుణలతో హైడ్రా సమావేశాలు నిర్వహించింది. గురువారం హైడ్రా కార్యాలయంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో వాటర్-ఉమెన్ రైట్స్ యాక్టవిస్టు డా. మన్సీబాల్ భార్గవతో హైడ్రా బృందం సమావేశమైంది. నగరంలో చెరువుల పరిస్థితిపై సమీక్షించారు. వాటికి పునరుజ్జీవనం కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలను హైడ్రా కమిషనర్ వివరించారు. హైడ్రా చర్యల పట్ల డా. మన్సీబాల్ భార్గవ హర్షం వ్యక్తం చేశారు. చెరువుల పునరుద్ధరణతోనే నగరానికి వరద ముప్పు తప్పుతుందంటూ ఆయన సూచించారు. అలాగే.. శరీరానికి నాడీ వ్యవస్థ ఎంత ముఖ్యమో.. చెరువులకు నాలా వ్యవస్థ అంతే అవసరమని డా. మన్సీబాల్ భార్గవ తెలిపారు. నాలాలు సరిగా ఉంటే.. వరద నీరు సాఫీగా చెరువుకు చేరుతుందని అన్నారు. అనుసంధానం ఉన్నప్పుడే ఒక దాని తర్వాత మరో చెరువు నిండుతుందని పేర్కొన్నారు. ఆ గొలుసు తెగకుండా చూడాలి.. ఎక్కడైనా ఆటంకాలు ఏర్పడితే వాటిని పునరుద్ధరించాలని తెలిపారు.
CM Chandrababu: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం.. రూ.45,300 కోట్లతో నాలుగు గ్రీన్‌ఫీల్డ్ హైవేలు!
Also Read
భారీ వర్షాలు కురవడంతో బెంగళూరులోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి.. ఇలాంటి పరిస్థితులు నగరంలో తలెత్త కూడదంటే చెరువుల అనుసంధానం, గొలుసుకట్టు చెరువులు, నాలా వ్యవస్థ సరిగా ఉండాలని డా. మన్సీబాల్ భార్గవ సూచించారు. సహజ సిద్ధంగా చెరువులకు పునరుజ్జీవనం కల్పించే పద్ధతులను వివరించారు. చెరువులకు కాలువులు జీవనాడులు.. వాటిని ముందుగా పరిరక్షించుకుంటూ.. ఆ కాలువల నుంచి మంచి నీరు వచ్చేలా చూస్తే.. చెరువుల కాలుష్యం తగ్గుతుందంటూ సూచనలు చేశారు. కాంక్రీట్ కట్టడాలు కాకుండా.. సహజసిద్ధంగా చెరువులను పునరుద్ధరించినప్పడే వాటిలో జీవకళ ఉంటుందని.. ఆ నీరు జీవరాసులకు ఉపయోగపడుతుందని భార్గవ తెలిపారు. ఇలా తక్కువ ఖర్చుతో చెరువులకు పునరుజ్జీవనం సాధ్యమౌతుందని అన్నారు.
Kaleshwaram Commission: మాజీ ఈఎన్సీని విచారించిన కాళేశ్వరం కమీషన్.. కీలక విషయాలు వెల్లడి
ఈ క్రమంలో.. ఆ విధానాలపై ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. నెలలో కురవాల్సిన వర్షం ఒక్క రోజులోనే.. ఒక్క రోజులో కురిసే వర్షం.. ఒక గంటలో పడి నగర జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న వేళ.. వరద నీటి కాలువలు ఎలా ఉండాలనే అంశంపై లోతైన చర్చ జరిపారు. వరద నీరు చెరువుకు చేరాలి.. చెరువులు నిండితే ఆ నీరు నదుల్లో కలవాలన్నారు. అలా కాకుండా ఆటంకాలు ఏర్పడితే నివాసాలు నీట మునుగుతాయని తెలిపారు. చెరువులలో ఆక్రమణలు తొలగింపు.. నగరం ముంపునకు గురి కాకుండా చేసిన శస్త్ర చికిత్స లాంటిదని డా. మన్సీబాల్ భార్గవ అన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!