పూణే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 16/1 పరుగులతో ఉంది. క్రీజులో యశస్వీ జైస్వాల్ (6*), శుభ్‌మన్ గిల్ (10*) ఉన్నారు. కాగా.. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 243 పరుగుల ఆధిక్యంలో ఉంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. ఏమీ పరుగులు చేయకుండానే కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 259 పరుగులకు ఆలౌటైంది.
Read Also: SP Bar Association: ఎవర్ని అడిగి మార్చారు? కొత్త న్యాయమాత విగ్రహంపై వివాదం..
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో డేవాన్ కాన్వే అత్యధికంగా (76) పరుగులు చేశాడు. ఆ తర్వాత.. రచిన్ రవీంద్ర (65), మిచెల్ సాంథ్నర్ (33) పరుగులు సాధించారు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ సూపర్ బౌలింగ్ చేశాడు. తన మ్యాజిక్ బౌలింగ్‌తో 7 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ భారీ స్కోరు చేయకుండా.. కివీస్ బ్యాటర్లను కట్టడి చేశాడు. మరోవైపు.. మరో స్పిన్ బౌలర్ అశ్విన్ కూడా 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లు మొత్తం వికెట్లు తీశారు.
Read Also: Supreme court: శరద్‌పవార్ పార్టీకి షాక్.. గడియారం గుర్తు అజిత్ పవార్ ఎన్సీపీదేనని వెల్లడి