తెలంగాణలో పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు రోడ్డెక్కారు. బెటాలియన్ కానిస్టేబుళ్లుగా పని చేస్తున్న భర్తల కోసం భార్యలు ధర్నాకు దిగారు. తెలంగాణ వ్యాప్తంగా పలు నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.
పూణే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. కాగా.. 259 పరుగులకు కివీస్ ఆలౌటైంది. భారత్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అత్యధికంగా 7 వికెట్లు తీసి.. న్యూజిలాండ్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.
మెదక్‌లో మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బార్లు, పబ్బులు, రెస్టారెంట్లపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మాదాపూర్ జోన్లో బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు హోటల్స్‌ల లైసెన్స్‌లను పోలీసులు తనిఖీ చేశారు. బార్లు పబ్బులలో సౌండ్ పొల్యూషన్ లైసెన్స్, పోలీస్ పర్మిషన్, జీహెచ్ఎంసి పర్మిషన్‌లను మాదాపూర్ పోలీసులు చెక్ చేశారు.
ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు తెలుగు టైటాన్స్-జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ మరోసారి ఓటమి పాలైంది. 21-51 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ విజయం సాధించింది.
వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కమిషనర్ ఆదిశేషు ఏసీబీ వలలో పడ్డాడు. బాధితుడి నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. అనంతరం.. మంగళవారం పక్కా సమాచారంతో.. వనస్థలిపురం కమ్మగూడలోని ఆదిశేషు ఇంట్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
సంగారెడ్డి జిల్లాలో కూడా అలాంటి మాదిరి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆస్తిలో వాటా కోసం భర్త మృతదేహానికి ఐదు రోజులుగా అంత్యక్రియలు నిర్వహించలేదు ఓ భార్య.. ఈ ఘటన సదాశివపేట (మం) తంగేడుపల్లిలో జరిగింది. మనుషులు ఇంత దారుణంగా ఉంటారా అన్న దానికి ఇదే నిదర్శనం.. వివరాల్లోకి వెళ్తే, తన భర్త ఐదు రోజుల క్రితం చనిపోయాడు. అయితే.. అప్పటి నుంచి ఆస్తిలో వాటా కోసం భర్త మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించలేదు ఓ భార్య.. కాగా, తల్లిదండ్రులు ఆస్తిని మొత్తం తన బావ…
అంబర్పేట మూసీ పరివాహక ప్రాంతంలో బీజేపీ నేతలతో కలిసి ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను హైడ్రాకు సపోర్ట్ చేశానని బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేశారని అన్నారు.