ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించి కీలక అప్‌డేట్స్ వస్తున్నాయి. జనవరిలో భారత్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ వస్తుందని ఐసీసీ ప్రకటించింది. ఈ ట్రోఫీకి హోస్టింగ్‌తో సంబంధం లేదు.. పెద్ద టోర్నమెంట్‌లకు ముందు ఐసీసీ ఈ ట్రోఫీ పర్యటనను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ నుంచి భారత్‌కు రానుంది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ట్రోఫీ టూర్ నవంబర్ 16 నుండి ప్రారంభమైందని.. 2025 జనవరి 26 వరకు కొనసాగుతుందని ఐసీసీ మీడియా ప్రకటనలో తెలిపింది. ఛాంపియన్స్ ట్రోఫీ చివరిగా భారత్‌కు రానుంది. ఈ ట్రోఫీ షెడ్యూల్ నవంబర్ 16 నుండి 25 వరకు పాకిస్తాన్‌లోని వివిధ నగరాల్లో జరుగుతుంది. ఆ తర్వాత నవంబర్ 26 నుండి 28 వరకు ఆఫ్ఘనిస్తాన్‌లో జరుగుతుంది. డిసెంబర్ 10 నుండి 13 వరకు బంగ్లాదేశ్‌లో ఉంటుంది. ఆ తర్వాత.. డిసెంబర్ 15 నుంచి 22 వరకు దక్షిణాఫ్రికాలో ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ జరగనుంది.
Read Also: Vande Bharat: వందే భారత్ రైలు ఆహారంలో పురుగులు.. జీలకర్ర అని ఉద్యోగి దబాయింపు
దక్షిణాఫ్రికా తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పర్యటన ఆస్ట్రేలియాకు చేరుకుంటుంది. అక్కడ ట్రోఫీ డిసెంబర్ 25 నుండి జనవరి 5 వరకు దేశంలోని వివిధ నగరాలలో నిర్వహిస్తుంది. ఆ తర్వాత.. ట్రోఫీ జనవరి 6 నుండి 11 వరకు న్యూజిలాండ్‌లో ఉంటుంది. ఆపై ట్రోఫీ జనవరి 12 నుండి 14 వరకు ఇంగ్లాండ్‌కు వెళుతుంది. ఆ తర్వాత భారత్‌కు రానుంది. జనవరి 15 నుంచి 26 వరకు భారత్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఆ తర్వాత ట్రోఫీ పాకిస్థాన్‌లో జరుగుతుంది.
జనవరి 27న పాకిస్థాన్‌లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత టోర్నీకి మిగిలిన సన్నాహాలు ప్రారంభమవుతాయి. ఈ టోర్నీ ఫిబ్రవరి-మార్చిలో జరగాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు వస్తున్న రిపోర్టుల ప్రకారం ఈ టోర్నీని పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించనుంది. భారత్ మూడు లీగ్ మ్యాచ్‌లు.. ఒక సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌లో ఆడనుంది.