ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీలలో జెద్దా (సౌదీ అరేబియా)లో జరుగనుంది. ఈసారి వేలంలో 574 మంది ఆటగాళ్ల పేర్లను బీసీసీఐ షార్ట్‌లిస్ట్ చేసింది. అందులో 366 మంది భారతీయ ఆటగాళ్లు ఉండగా.. 208 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అయితే.. ఈసారి ఐపీఎల్ వేలంలో నిలిచిన అత్యంత పిన్న వయస్కుడు 14 ఏళ్లు కాగా, పెద్ద వయసు ఆటగాడు 42 ఏళ్లు.
శిరోమణి అకాలీదళ్ అధ్యక్ష పదవికి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ (62) శనివారం రాజీనామా చేశారు. ఈ విషయాన్ని పంజాబ్ మాజీ విద్యాశాఖ మంత్రి దల్జిత్ ఎస్ చీమా ట్వీట్ చేశారు.
త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్ గౌడ్‌కు అరుదైన రికార్డు దక్కింది.. న్యాయమూర్తిగా అత్యధిక కేసులు పరిష్కరించి జస్టిస్ అమర్‌నాథ్‌గౌడ్ రికార్డ్ సృష్టించారు.. ఈ క్రమంలో.. తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా శనివారం ఆయన పురస్కారం అందుకున్నారు.. మరోవైపు.. జస్టిస్ అమర్‌నాథ్‌గౌడ్‌కు యూకే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు దక్కింది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండోసారి తండ్రి అయ్యాడు. భార్య రితికా సజ్దే నవంబర్ 15న (శుక్రవారం) మగబిడ్డకు జన్మనిచ్చింది. రోహిత్ శర్మకు కొడుకు పుట్టడంతో అతని కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ కుటుంబ సభ్యులు నలుగురయ్యారు. రోహిత్, రితిక దంపతులకు 2018లో సమైరా అనే కూతురు జన్మించింది. కాగా.. కొడుకు పుట్టడంపై రోహిత్ శర్మతో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. రోహిత్ శర్మ మొదటి సారి స్పందించాడు. సోషల్ మీడియాలో…
అరటిపండు అన్ని సీజన్లలో లభిస్తుంది. అరటిపండు తింటే ఆరోగ్యం దృఢంగా ఉంటుంది. ఇది శరీరంలోని అన్ని భాగాలకు అద్భుతంగా పని చేస్తుంది. చలికాలంలో అరటి పండు తింటే దగ్గు, జలుబు వస్తుంది. కాబట్టి.. రాత్రి పూట తినొద్దు.
జామ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. అలాగే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇందులో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఏంటాయి. జామపండు ఈ సీజన్‌లో ఎక్కువగా దొరుకుతుంది. అయితే.. జామపండ్లు అందరూ తినలేరు. వీటిని తింటే కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ బాలల దినోత్సవాన్ని (చిల్డ్రన్స్ డే) జరుపుకున్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియాకు వెళ్లిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో.. గురువారం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తన కొడుకు ఆకాయ్, కూతురు వామికతో కలిసి బాలల దినోత్సవాన్ని జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను దంపతులిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుసగా మూడో విజయాన్ని సాధించింది. గురువారం బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు 13-0తో థాయ్‌లాండ్‌ను ఓడించింది.
అందమైన మెరిసే చర్మాన్ని పొందడానికి తులసి ఆకులు చాలా సహాయపడతాయి. తులసిలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు మొటిమలను తగ్గించడంలో చాలా ఉపయోగ పడుతాయి. తులసిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చి ఛాయను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
తెలంగాణ గ్రూప్ 4 ఫలితాలు విడుదల అయ్యాయి. 8,180 పోస్టులకు 8,084 మంది అభ్యర్థులను సెలెక్ట్ చేశారు. కాగా.. 8,180 పోస్టులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022 డిసెంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే..