పార్టీ, ఫంక్షన్ ఇలా వేడుక ఏదైనా కూల్ డ్రింక్స్ తాగేస్తుంటారు. ఇలా ఇష్టమైన డ్రింక్స్ తాగుతుంటే.. ఆ మజానే వేరుంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ వీటిని ఎంతో ఇష్టంగా తాగుతారు. అయితే.. అలాగే అలవాటైతే మీ శరీరంలో ఉన్న కాలేయం దెబ్బ తినే అవకాశం ఉంది. అవును, మీరు విన్నది నిజమే.. మీ కాలేయానికి చాలా హాని కలిగించే, కాలక్రమేణా కాలేయ వ్యాధులను కలిగించే కొన్ని పానీయాలు ఉన్నాయి.
నవంబర్ 22న ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా పెర్త్‌లో నెట్స్‌లో కఠినమైన ప్రాక్టీస్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ మినహా జట్టు సభ్యులందరూ ఆస్ట్రేలియా చేరుకున్నారు. వ్యక్తిగత కారణాలతో రోహిత్ తొలి టెస్టుకు దూరం కానున్నాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్‌లు ర్యాన్ టెన్ డోస్చాట్, అభిషేక్ నాయర్ పర్యవేక్షణలో బుధవారం పెర్త్‌లో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు మొత్తం జట్టు హాజరయ్యారు. WACA స్టేడియంలో ప్రతిరోజూ గంటల తరబడి నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఆరోగ్యంగా ఉండటానికి శారీరక శ్రమ అవసరం. అందు కోసం ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఒకవేళ వ్యాయామం చేయడానికి సమయం లేకపోతే.. కనీసం కాలి నడక అయినా అలవాటు చేసుకోవాలి. రోజువారీ నడక అలవాటు శారీరక శ్రమను పెంచుతుంది. అంతేకాకుండా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఎముకల దృఢత్వం, మానసిక ఆరోగ్యం, కీళ్ల ఆరోగ్యం మెరుగుపడతాయి.
ఇటాలియన్ టూ-వీలర్ తయారీ స్కూటర్ బ్రాండ్ వెస్పా తన ఫ్లాగ్‌షిప్ మోడల్ GTS 310ని మిలన్‌లోని EICMA 2024లో ఆవిష్కరించింది. ఈ స్కూటర్‌ను అనేక అద్భుతమైన ఫీచర్లతో తయారు చేశారు.
మహిపాల్ లోమ్రోర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌లో మొదటి ట్రిపుల్ సెంచరీని సాధించాడు. 253 బంతుల్లో తన డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. అందులో 8 సిక్సర్లు, 18 ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత కూడా అదే దూకుడు బ్యాటింగ్ చేశాడు. దీంతో.. మహిపాల్ 357 బంతుల్లో తన ట్రిపుల్ సెంచరీని పూర్తి చేశాడు. మహిపాల్ 360 బంతుల్లో 13 సిక్సర్లు, 25 ఫోర్ల సాయంతో అజేయంగా 300 పరుగులు చేశాడు.
బెంగాల్-మధ్యప్రదేశ్ మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో మహ్మద్ షమీ ఇంతకు ముందు ప్రదర్శనను కనబరిచాడు. బెంగాల్ జట్టు తరపున ఆడుతున్న షమీ.. మొదటి రోజు వికెట్ సాధించకపోయినప్పటికీ, రెండో రోజు అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్ల పడగొట్టాడు. 360 రోజుల విరామం తర్వాత, ప్రొఫెషనల్ మ్యాచ్ ఆడేందుకు తిరిగి వచ్చాడు. ఇది అతని పునరాగమన మ్యాచ్.
తినే ఆహారంలో ఉప్పు ఉంటేనే రుచిగా ఉంటుంది. అయితే కొంతమంది ఉప్పు ఎక్కువగా తింటారు.. మరికొందరు మితంగా తింటారు. ఉప్పు ఆహారంలో రుచిని పెంచడమే కాకుండా ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఉప్పు తింటే కడుపులో మంట అదుపులో ఉంటుంది. శరీరంలో సోడియం, క్లోరైడ్ సమతుల్యతను కాపాడుకోవడానికి ఉప్పు చాలా ఉపయోగపడుతుంది.
దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో భాగంగా.. నవంబర్ 13న సెంచూరియన్‌లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. సౌతాఫ్రికాపై టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక విజయాలు నమోదు చేసిన భారత్.. ఆస్ట్రేలియాను సమం చేసింది. టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్, ఆస్ట్రేలియా రెండు జట్లు 17-17 సార్లు దక్షిణాఫ్రికాను ఓడించాయి.
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోవడం ఎంత ముఖ్యమో, సమయానికి నిద్ర లేవడం కూడా అంతే ముఖ్యం. అయితే.. రాత్రి 10 గంటలకే నిద్రపోవాలని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. జీవక్రియ ఆరోగ్యంగా ఉండటానికి.. అనేక రకాల వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించడానికి ఇది చాలా ముఖ్యం. వైద్యులు తొందరగా పడుకోవాలని సూచిస్తున్నా.. కొందరైతే రాత్రి 12 తర్వాత నిద్రపోయే వారు ఉన్నారు. అయితే.. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం, సరిపడా నిద్రపోకపోవడం ఆరోగ్యానికి అనేక విధాలుగా హానికరం.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొత్త బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ మునాఫ్ పటేల్‌ను కొత్త బౌలింగ్ కోచ్‌గా నియమించింది. ఈ విషయాన్ని ఢిల్లీ ఫ్రాంచైజీ మంగళవారం ప్రకటించింది. ప్రధాన కోచ్ హేమంగ్ బదానీ, క్రికెట్ డైరెక్టర్ వేణుగోపాలరావుతో పాటు ఢిల్లీ కోచింగ్ స్టాఫ్‌లో భాగంగా ఉంటారు. మునాఫ్ 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడు. 2018లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.