ఒకప్పుడు చక్రం తిప్పిన నాయకుడు ఇప్పుడు గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నాడా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మండవ వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా.. మంత్రిగా ఒకప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడు. అప్పట్లో టీడీపీ అధినేత ఎన్టీఆర్, చంద్రబాబులకు కుడిభుజంగా పేరుతెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత పొలిటికల్ తెరపై మండవ పేరు పెద్దగా వినిపించలేదు. కొన్నాళ్లు రాజకీయాల్లో సైలెంట్‌గా ఉన్నప్పటికీ.. మొన్నటి లోక్‌సభ ఎన్నికల ముందు గులాబీ కండువా కప్పుకొన్నారు. సీఎం కేసీఆర్ నేరుగా మండవ ఇంటికి వెళ్లి టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. రాజకీయంగా పాత పరిచయాలు.. స్నేహం ఉండటంతో సైకిల్ దిగి.. కారెక్కేశారు మండవ. ఆ సమయంలోనే మాజీ మంత్రికి మంచి పదవి వస్తుందని ప్రచారం జరిగింది. అయితే పదవుల కోసం పార్టీ మారలేదని ఆయన పదే పదే చెప్పినా.. అనుచరులు మాత్రం తమ నేత నెంబర్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడటమే సరిపోతోంది. పైగా తెలంగాణలో రాజ్యసభ, శాసనమండలి స్థానాల భర్తీకి షెడ్యూల్ వచ్చిన ప్రతిసారీ మండవ పేరు చర్చల్లోకి రావడం.. తర్వాత ఉస్సూరుమనడం కామనైపోయింది. తాజాగా రాజ్యసభ స్థానాల భర్తీలోనూ మాజీ మంత్రికి మరోసారి మొండిచెయ్యేనని చెవులు కొరుక్కుంటున్నారు.
మండవ గులాబీ గూటికి చేరి మూడేళ్లు అవుతోంది. ఆయన కంటే కొద్దీ రోజుల ముందు కారెక్కిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డిని రాజ్యసభ సభ్యుడిని చేశారు. మండవకు మాత్రం అలాంటి ఒక్క ఊరట దక్కలేదు. ఇంకా టైమ్ రాలేదని అనుకున్నారో ఏమో మళ్లీ కొద్దిరోజులుగా మౌనంగా ఉంటున్నారు మాజీ మంత్రి. ఆయన్ను నమ్ముకున్న అనుచరులు మాత్రం ఏదో ఒక పదవితో మళ్లీ యాక్టివ్ కావాలని ఒత్తిడి తెస్తున్నారట. ప్రస్తుతం ఒక ఉపఎన్నికతోపాటు మరో రెండు రాజ్యసభ స్థానాల భర్తీకి షెడ్యూల్ వచ్చింది. వీటిల్లో ఒకటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన డీ శ్రీనివాస్ పదవీకాలం పూర్తి చేసుకుంటున్న సీటు ఉంది. ఆ స్థానాన్ని మండవకు కట్టబెడతారని ప్రచారం జరిగింది. అధిష్ఠానం దగ్గర పేరు చర్చకు వచ్చినా.. సామాజిక సమీకరణాల వల్ల చివరి నిమిషంలో రేసు నుంచి తప్పించారని అనుకుంటున్నారట. ఆ విషయం తెలిసినప్పటి నుంచి మండవ అనుచరులు డీలా పడ్డారట.
Also Read
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- OTR : విజయనగరం టీడీపీలో మేయర్ సీటు ఎవరిదో..అధిష్టానం మనసులో ఉన్నదెవరు?
జరుగుతున్న పరిణామాలకు నొచ్చుకున్నారో ఏమో రాజకీయాలకు దూరంగా ఉండాలని మండవ భావిస్తున్నట్టు ఒక ప్రచారం జరుగుతోంది. అనుచరులు మాత్రం దానికి ఒప్పుకోవడం లేదట. రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవులు దక్కకపోయినా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారట. టీఆర్ఎస్ పెద్దల ఆలోచనల్లోనూ మండవ గురించి ఇదే అభిప్రాయం ఉందని టాక్. ఈ ప్రతిపాదనపై మండవ ఏమనుకుంటున్నారో బయటకు రాలేదు. పార్టీ పెద్దల బుజ్జగింపులకు స్పందనేంటో అని కేడర్ ఆరా తీసే పరిస్థితి ఉంది. ఒకవేళ అసెంబ్లీ బరిలో ఉండాలని నిర్ణయిస్తే.. ఎవరి సీటు ఖాళీ చేస్తారనే చర్చ కూడా ఊపందుకుంటోంది. మరి.. మాజీ మంత్రి మళ్లీ రాజకీయంగా చురుకైన పాత్ర పోషిస్తారో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!