Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Off The Record Before Amith Shah Arrival One Count After The Arrival Of Amit Shah Another Count

మొన్నటి దాకా ఒక లెక్క..అమిత్ షా వచ్చాక మరో లెక్క

Published Date - 11:47 AM, Tue - 17 May 22
By Sista Madhuri
మొన్నటి దాకా ఒక లెక్క..అమిత్ షా వచ్చాక మరో లెక్క

తెలంగాణ బీజేపీలో ఉన్న అంతర్గత ఆధిపత్య పోరుకు పార్టీ అగ్రనేత అమిత్ షా చెక్ పెట్టినట్టేనని తాజా టాక్‌. పార్టీ రాష్ట్ర చీఫ్‌ బండి సంజయ్‌కే హైకమాండ్‌ అండ అని తుక్కుగూడ సభలో షా క్లారిటీ ఇవ్వడంతో.. కాషాయ శిబిరంలో అలజడి మొదలైందట. బహిరంగ సభ నుంచే పార్టీ నేతలకు.. శ్రేణులకు షా స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో ప్రస్తుతం ఆ అంశాలపైనే వాడీవేడీ చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కొందరు బీజేపీ సీనియర్లకు బీపీ ఎక్కువైందట.

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత ముగింపు సభ సక్సెస్ అయిందని బీజేపీ శ్రేణులు సంబర పడుతున్నాయి. అమిత్ షా సభకు హాజరు కావడం.. ఆయన మాట్లాడిన మాటలు.. కామెంట్స్‌ చేసిన తీరు కమలదళానికి బలమైన టానిక్‌గా పనిచేస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. అయితే షా చేసిన కొన్ని కామెంట్స్‌ చుట్టూ పార్టీ వర్గాల్లో గట్టి చర్చే జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఓడించడానికి తాను రావాల్సిన అవసరం లేదని.. బండి సంజయ్‌ సరిపోతారని అమిత్‌ షా ప్రకటించారు. సంజయ్యే రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తారని చెబుతూ.. ఆయన పాదయాత్రపై ప్రశంసల జల్లు కురిపించారు. పైగా మూడో విడత పాదయాత్ర ఉంటుందని సంకేతాలివ్వడమే కాకుండా.. రాష్ట్ర చీఫ్‌ను దగ్గరకు తీసుకుని ఆప్యాయత ప్రదర్శించారు.

తుక్కుగూడ సభలో ఆ దృశ్యాలు చూసినవారందరికీ.. బీజేపీలో సంజయ్‌ ప్రాధాన్యంపై చెవులు కొరుకుడు ఎక్కువైంది. వాస్తవానికి బీజేపీలో అంతర్గత పోరు ఎక్కువగా ఉంది. సంజయ్‌ సారథ్యాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. కొందరైతే ఢిల్లీ నాయకత్వానికి ఫిర్యాదులు చేసిన ఉదంతాలు ఉన్నాయి. అసమ్మతి.. అసంతృప్తి పెద్దగా బుసలు కొట్టకపోయినా.. రాష్ట్ర బీజేపీ నేతల మధ్య సఖ్యత లేదన్నది కాషాయ శిబిరంలో గట్టిగా వినిపించే మాట. ఒకరినొకరు కలుపుకొని సాగే వాతావరణం కనిపించడం లేదట. ఈ క్రమంలోనే ఒకరిద్దరు నేతలు సంజయ్‌పై బీజేపీ అగ్రనాయకత్వానికి ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర చీఫ్‌పై ఇలా ఆరోపణలు వస్తే అగ్రనాయకత్వం గట్టిగానే పరిశీలిస్తుంది. దానికి తగ్గట్టుగానే పార్టీ నేతలు దూకుడు తగ్గించడమో.. వైఖరి మార్చుకోవడమో చేస్తారు. కానీ.. తుక్కుగూడ సభలో అమిత్‌షా కామెంట్స్‌.. సంజయ్‌ను పోగడ్తల్లో ముంచెత్తడం చూశాక.. ఫిర్యాదులను ఢిల్లీ పెద్దలు పక్కన పెట్టేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయట.

సభలో అమిత్‌ షా ఆ విధంగా మాట్లాడతారు అనికానీ.. పాదయాత్రను అంతలా ప్రశంసిస్తారని కానీ బీజేపీలో చాలా మంది సీనియర్లు ఊహించలేదట. దీంతో ఇప్పుడేం చేయాలా అని తీవ్రంగా మథన పడుతున్నట్టు సమాచారం. పైగా ఇకపై పార్టీలో తమపట్ల సంజయ్‌ ఇతర నేతల తీరు ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారట. మొత్తానికి అమిత్ షా సభ కాషాయదళంలో ఉత్సాహంతోపాటు కొందరిలో కలవరం కూడా తీసుకొచ్చినట్టే కనిపిస్తోంది.

  • Tags
  • Amith Shah
  • bandi sanjay
  • bjp
  • Praja Sangrama Yatra
  • tukkuguda

RELATED ARTICLES

Bandi Sanjay: బండి సంజయ్‌ నారాజ్..! ఢిల్లీ పెద్దల వద్ద ఆవేదన..!

LIVE : నవనీత్ కౌర్ ఎంట్రీతో హీటెక్కిన మహారాష్ట్ర రాజకీయం l NTV Live

LIVE : మహారాష్ట్రలో టెన్షన్ టెన్షన్..రోడ్డెక్కిన శివసేన కార్యకర్తలు l Maharashtra Politics l NTV

Tarun Chug: కేసీఆర్‌కు బైబై చెప్పే టైం వచ్చింది..

Draupadi Murmu: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మాయావతి మద్దతు

తాజావార్తలు

  • Maharashtra Political Crisis: వడోదర వేదికగా ఏక్ నాథ్ షిండే, ఫడ్నవీజ్ రహస్య చర్చలు

  • Vijayawada: సిటీ నుంచి ఐదుగురు రౌడీషీటర్లపై బహిష్కరణ వేటు

  • DJ Tillu 2: ముహూర్తం ఫిక్స్.. అనౌన్స్ చేసిన నిర్మాత

  • COVID 19: తగ్గిన కరోనా ఉధృతి.. తెలంగాణలో భారీగానే కేసులు

  • China: ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1000 కిలోమీటర్ల రేంజ్

ట్రెండింగ్‌

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions