పీజేఆర్ తనయుడు ఏం చేస్తున్నారు ? పాలిటిక్స్ కు దూరమా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్‌లో పి. జనార్దన్‌రెడ్డి వారసుడిగా విష్ణువర్దన్‌రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. పీజేఆర్ మరణంతో జరిగిన ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు విష్ణు. తర్వాత నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి మరోసారి అసెంబ్లీకిలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికలు విష్ణుకు కలిసిరాలేదనే చెప్పాలి. 2014 మూడోస్థానంలో నిలిచిన ఈ యువనేత.. 2018లో మళ్లీ పుంజుకున్నా.. రెండోస్థానానికే పరిమితం అయ్యారు. రెండు వరస ఓటములు కుంగదీశాయో ఏమో.. తర్వాత కాంగ్రెస్ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించింది లేదు ఈ మాజీ ఎమ్మెల్యే.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పీజేఆర్‌కి ఫాలోయింగ్ ఉంది. విష్ణు దాన్ని క్యాచ్ చేసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్‌లో విష్ణుకు ఆత్మీయులు ఉన్నా.. ఆయన మాత్రం కొన్నాళ్లుగా అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శ ఉంది. దీంతో కాంగ్రెస్ నాయకత్వం కూడా ఈ మాజీ ఎమ్మెల్యే విషయంలో ఆలోచనలో పడినట్టు ప్రచారం జరుగుతోంది.
Also Read
- OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక.. PJR ఇంటికి వెళ్లారు. కాంగ్రెస్‌లో మళ్లీ చురుకైన పాత్ర పోషించాలని విష్ణును కోరారు రేవంత్. కానీ.. ఎలాంటి మార్పు లేదట. పార్టీ సభ్యత్వ నమోదును కూడా సీరియస్‌గా తీసుకోలేదని చెబుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. హైదరాబాద్ వస్తే.. ఆ టూర్‌లో ఎక్కడా విష్ణు కనిపించలేదు. ఒకప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ అంటే.. PJR, ముఖేష్‌గౌడ్, దానం నాగేందర్ అనేట్టు ఉండేది. ఇప్పుడు ముఖేష్‌గౌడ్ లేరు. దానం నాగేందర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇక PJR వారసుడిగా పార్టీలో లీడ్ రోల్ పోషించాల్సిన విష్ణువర్దన్‌రెడ్డి.. ఎందుకు సైలెంట్‌గా ఉన్నారన్నది కేడర్ ప్రశ్న. రాహుల్ గాంధీ వచ్చినా ఎందుకు కనిపించలేదని ప్రశ్నిస్తున్నారు.
గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశానికి రాహుల్ గాంధీ హాజరైతే.. ఆ కార్యక్రమానికి విష్ణువర్దన్‌రెడ్డి వస్తారని ఒక సీటు కేటాయించారు. కానీ.. ఈ మాజీ ఎమ్మెల్యే ఆ ఛాయలకే రాలేదు. దీంతో గ్రేటర్ కాంగ్రెస్‌కు చెందిన ఒకరిద్దరు కాంగ్రెస్ నాయకులు.. ఈ విషయాన్ని AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ దృష్టికి తీసుకెళ్లారట.
రాహుల్ పర్యటనకే దూరంగా ఉంటే.. ఇక నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? నాయకుల పిల్లల కోసం నియోజకవర్గాలు కేటాయిస్తారు.. వాళ్లేమో పార్టీని పట్టించుకోవడం లేదనే ఠాగూర్ దగ్గర చర్చించినట్టు సమాచారం.
కాంగ్రెస్‌లో PJRకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ స్థాయిలో పీజేఆర్ తనయుడు విష్ణు ఉండటం లేదనేది పార్టీ వర్గాల మాట. రాజకీయాలకు అంటీముట్టనట్టు ఉండాలని అనుకుంటున్నారా? లేక మరేదైనా ఆలోచన ఉందో కానీ.. కాంగ్రెస్‌కు అవుటాఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నారన్న ప్రచారం మాత్రం ఆసక్తి రేకెత్తిస్తోంది.
తాజావార్తలు
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లే!
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!