రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదిపేసింది కరోనా మహమ్మారి. కోట్లాది మంది కూలీల పొట్టగొట్టింది.. లక్షలాది మంది వ్యాపారులను నట్టేట ముంచింది… సొంతింటి కలనూ దూరం చేసింది. ఆర్థిక మాంద్యంతో ఆటుపోట్లను ఎదుర్కొంటున్న రియాల్టీ రంగాన్ని.. కోలుకోలేని కష్టాల్లోకి నెట్టింది కరోనా. నిత్యకళ్యాణం.. పచ్చతోరణం అన్నట్టుండే హైదరాబాద్ రియల్ రంగం.. కోవిడ్ కాటుతో విలవిల్లాడుతోంది. కరోనా తర్వాత ఊహించిందే జరిగింది. రియల్ బుడగ పేలుతోంది. హైదరాబాద్.. మన దేశమే కాదు..ప్రపంచవ్యాప్తంగా రియల్ రంగం సంక్షోభంలో ఉందని చైనాను చూస్తే […]
అలిగిరి ప్రవీణ్‌రెడ్డి. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రవీణ్ రెడ్డి .. 2014లో ఓడిపోయారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో కండువా మార్చేశారు. గులాబీ గూటికి చేరుకున్నారు ప్రవీణ్‌రెడ్డి. అయితే రెండు దఫాలుగా హుస్నాబాద్‌లో టీఆర్ఎస్ నుంచి వొడితల సతీష్ కుమార్ ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. దీంతో అధికారపార్టీలో టికెట్ రాదనుకున్నారో లేక.. అక్కడ గుర్తింపు లేదని భావిస్తున్నారో కానీ.. కాంగ్రెస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట ప్రవీణ్‌రెడ్డి. రాష్ట్రంలో […]
2019 ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ అత్యధిక మెజార్టీతో గెలిచిన నియోజకవర్గం పోలవరం. 42 వేల ఓట్లకుపైగా మెజార్టీతో నాలుగోసారి గెలిచారు తెల్లం బాలరాజు. అయితే ఎన్నికల తర్వాత నుంచి మారుతున్న పరిణామాలతో నియోజకవర్గంలో అధికారపార్టీ పరిస్థితి అయోమయంగా తయారయ్యింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు, పునరావాస కల్పన గతంకంటే మెరుగ్గానే ఉన్నప్పటికీ.. నియోజకవర్గ అభివృద్ది విషయంలో ఆశించిన ఫలితాలను రాబట్టడంలో ఎమ్మెల్యే వెనకపడ్డారన్నది పార్టీ శ్రేణులు చెప్పేమాట. ఈ విషయంలో వైసీపీ లోకల్ లీడర్సే బాలరాజుపై […]
బాబూమోహన్. మాజీ మంత్రి. గతంలో ఆందోల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ, టీఆర్ఎస్ల నుంచి గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టారు కూడా. గత ఎన్నికల సమయంలో బీజేపీలో చేరిపోయారు. ఈ దఫా ఎలాగైనా గెలిచి తిరిగి పట్టు సాధించాలని చూస్తున్నారు బాబూమోహన్. నియోజకవర్గంపై పట్టు ఉండటంతో తప్పకుండా తనకే బీజేపీ సీటు ఇస్తుందని లెక్కలేసుకుంటున్నారు. అయితే ఆందోల్ బీజేపీలో పరిస్థితులు మరోలా ఉన్నాయట. అక్కడ జడ్పీ మాజీ ఛైర్మన్ బాలయ్య నుంచి గట్టి పోటీ ఉందట బాబూమోహన్‌కు. దీంతో […]
మద్దిశెట్టి వేణుగోపాల్. దర్శి వైసీపీ ఎమ్మెల్యే. బూచేపల్లి శివప్రసాదరెడ్డి.. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే. బూచేపల్లి వెంకాయమ్మ.. ప్రకాశం జిల్లా జడ్పీ ఛైర్పర్సన్. అంతా వైసీపీ నేతలే. వెంకాయమ్మ కుమారుడే శివప్రసాదరెడ్డి. బూచేపల్లి వర్గానికి.. మద్దిశెట్టి వర్గానికి మూడేళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎవరి వర్గం వారిదే. దర్శి వైసీపీలో ప్రస్తుతం రెండు పవర్ సెంటర్స్ ఉన్నాయి. అందుకే సమస్య వస్తే పెద్ద చర్చకు దారితీస్తోంది. పార్టీ పెద్దలు అనేకసార్లు సయోధ్యకు ప్రయత్నించినా.. పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. […]
మహబూబాబాద్ జిల్లా టీఆర్ఎస్ నేతలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతున్నారు. గతంలో ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్.. ఎంపీ కవిత చేతుల్లోంచి మైక్ లాక్కొని కలకలం రేపితే… తాజాగా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మంత్రి సత్యవతి రాథోడ్‌పై చేసిన పరోక్ష వ్యాఖ్యలు.. నేతల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మానుకోటలో కారు స్టీరింగ్ అదుపు తప్పుతుందా అనే అనుమానాలు పార్టీలో వర్గాల్లో ఉన్నాయట. ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రెడ్యా నాయక్.. […]