అధికారులు బదిలీపై వెళ్తే.. లోకల్‌గా ఉన్న ఎమ్మెల్యే, కలెక్టర్, లేదా మంత్రిని మర్యాదపూర్వకంగా కలవడం ఆనవాయితీ. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో మాత్రం పూర్తి డిఫరెంట్. ఇక్కడికి ఎవరొచ్చినా.. ఏం జరగాలన్నా ముందుగా ఎమ్మెల్యే సోదరులను కలవాలట. ఇక్కడ ఎమ్మెల్యే మొన్నటి వరకు మంత్రిగా చేసిన శంకర నారాయణ. తొలిసారి శాసనసభ్యుడిగా గెలిచినా.. 2019లోనే కేబినెట్లో చోటు కొట్టేశారు. ఇందుకు సామాజికవర్గం సమీకరణాలు కలిసొచ్చాయి. శంకర నారాయణ ఎమ్మెల్యే కాకముందు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కూడా. ఆ సమయంలో […]
గతంలో ఎన్నడూ లేనివిధంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో స్వామి వారి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. మే నెలలో రికార్డు స్థాయిలో 130 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఒక్క నెలలోనే ఇంత భారీ స్థాయిలో ఆదాయం రావడం ఇదే మొదటిసారి. మే నెలలో 22లక్షల 62వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఎన్నడూ లేనివిధంగా చరిత్రలో తొలిసారి ఒక్క నెలలో స్వామి వారి హుండీ ఆదాయం భారీగా […]
విశాఖ జిల్లా వైసీపీలో కో-ఆర్డినేటర్లకు గడ్డుకాలం నడుస్తోంది. పశ్చిమ, దక్షిణ స్ధానాల్లో ఇంఛార్జుల పంచాయితీ చల్లారక ముందే.. తాజాగా తూర్పు నియోజకవర్గంలో తిరుగుబాటుకు చాప కింద నీరులా ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో అధికారపార్టీకి తూర్పు నియోజకవర్గం చాలా కీలకం. ఇక్కడ వరసగా మూడుసార్లు టీడీపీ గెలిచింది. 2019 ఎన్నికల్లోనే సిట్టింగ్ ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకు వైసీపీ వ్యూహం రచించినా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు అక్కడి టీడీపీలో అంతర్గత బలహీనతలు బయటపడి పరిస్థితిని మార్చేస్తున్నాయి. […]
ఆరే ఆరు నెలలు. తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లు.. ఇతర నాయకులు నోళ్లు కట్టుకుని కూర్చున్నారు. తమ సహజ శైలికి భిన్నంగా మౌనం దాల్చారు. ఆ కూలింగ్ పీరియడ్ అయిపోయిందని అనుకున్నారో ఏమో.. మళ్లీ పూర్వ పద్ధతిలోకి వచ్చేశారు. కాంగ్రెస్‌లో అంతే అనే రీతిలో విభేదాలకు ఆజ్యం పోస్తున్నారు. నేరుగా పీసీసీ చీఫ్‌కే గురిపెట్టేవారు కొందరైతే.. సీనియరైతే నాకేంటి అనేలా మరికొందరి వైఖరి ఉంది. ఇలాంటి సమస్యలు వస్తే గతంలో AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఉన్నవాళ్లు వెంటనే […]
రాజధానిలో కీలక ప్రాంతం గుంటూరు. మున్సిపల్ కార్పొరేషన్లో చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిపై కోర్టుకు వెళ్లడంతో గుంటూరు కార్పొరేషన్‌కు పదేళ్లపాటు ఎన్నికలు జరగలేదు. ఆ సమయంలో అధికారులే కీలకంగా మారారు. గుంటూరు అభివృద్ది కూడా నత్తనడకన సాగింది. ఏడాదిన్నర క్రితం ఎన్నికలు జరగడంతో సమస్యలు పరిష్కారం అవుతాయని జనం ఆశించారు. కొత్త పాలకవర్గం కొలువుదీరింది కానీ.. సీన్ మాత్రం మారిపోయింది. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి గెలిచామని.. ఇప్పుడు పదవి […]
రంగారెడ్డి జిల్లా టిఆర్ఎస్లో మంత్రి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అన్నట్టు రాజకీయాలు మారుతున్నాయి. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్య అంతర్గత పోరు మరోసారి బయట పడింది. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన తీగల.. చెరువులు, పాఠశాల స్థలాలు కబ్జా చేస్తున్నారని.. వాటిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రొత్సహిస్తున్నారని ఆరోపించారు. అక్కడితో ఆగకుండా మీర్‌పేటలో అభివృద్ధి పనులు జరగడం లేదంటూనే.. అసలు సబితా తమ పార్టీలో గెలిచిన వ్యక్తి కాదని విమర్శల […]