రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదిపేసింది కరోనా మహమ్మారి. కోట్లాది మంది కూలీల పొట్టగొట్టింది.. లక్షలాది మంది
వ్యాపారులను నట్టేట ముంచింది… సొంతింటి కలనూ దూరం చేసింది. ఆర్థిక మాంద్యంతో ఆటుపోట్లను
ఎదుర్కొంటున్న రియాల్టీ రంగాన్ని.. కోలుకోలేని కష్టాల్లోకి నెట్టింది కరోనా. నిత్యకళ్యాణం.. పచ్చతోరణం అన్నట్టుండే
హైదరాబాద్ రియల్ రంగం.. కోవిడ్ కాటుతో విలవిల్లాడుతోంది.
కరోనా తర్వాత ఊహించిందే జరిగింది. రియల్ బుడగ పేలుతోంది. హైదరాబాద్.. మన దేశమే కాదు..ప్రపంచవ్యాప్తంగా రియల్ రంగం సంక్షోభంలో ఉందని చైనాను చూస్తే తెలుస్తోంది. సమీప భవిష్యత్తులో కోలుకునే అవకాశం లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఆన్ రాక్ సర్వే ప్రకారం…. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు గణనీయంగా తగ్గినట్లు తేలింది. 2020 తొలి త్రైమాసికంలో కేవలం 7 ప్రధాన నగరాల్లోని అమ్మకాలను
పరిశీలిస్తేనే గృహాల అమ్మకాలు 45 వేల 200 కు పడిపోయాయి. గతేడాది సరిగ్గా ఇదే సమయంలో అమ్మకాల సంఖ్య 78 వేల 510. దీంతో అమ్మకాల్లో మొత్తంగా 42% క్షీణత కనిపించింది. ఇదే సమయంలో కొత్త ప్రోజెక్టుల ప్రారంభం విషయంలోనూ క్షీణించాయి. ఈ మూడు నెలల కాలంలో కొత్తగా కేవలం 41 వేల 200 యూనిట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అదే 2019 లో 70 వేల 480 యూనిట్లు. ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలో మొత్తంగా 6.65 లక్షల యూనిట్ల గృహాలను విక్రయించినట్లు ఆన్ రాక్ చెప్తోంది.
ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందింది. కొన్ని సంవత్సరాలుగా ,బెంగళూరు కు గట్టి పోటీ ఇచ్చింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో అమ్మకాల వృద్ధి కంటే చాలా మెరుగైన వృద్ధిని,నమోదు చేస్తూ వచ్చింది. కానీ… కరోనా కాటుతో హైదరాబాద్‌లోనూ రియల్ ఎస్టేట్ అధికంగా ప్రభావితం అవుతోంది.
2020 జనవరి నుంచి మార్చి వరకు ఇక్కడ కేవలం 2 వేల 680 యూనిట్ల గృహాలు అమ్ముడుపోయాయి. 2019 లో 5వేల 400 అమ్ముడయ్యాయి. భాగ్యనగరంలో రియల్ వృద్ధిలో 50% క్షీణత నమోదైనట్లే. మరో మూడు, నాలుగు నెలలు ఇదే పరిస్థితి కొనసాగుతుంది అంటున్నాయి రియల్ ఎస్టేట్ వర్గాలు.
దేశ ఆర్థిక రాజధాని ముంబై… రియల్ ఎస్టేట్ కు స్వర్గధామం గా ఉంటుంది. అక్కడ ఒక ఇల్లు కొనుగోలు చేయటమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ధరలు ఎంత అధికంగా ఉన్నప్పటికీ డిమాండ్ కూడా అంతకు ఎక్కువే.కానీ కరోనాతో ముంబైలో కొత్త యూనిట్ల ప్రారంభం ఘోరంగా పడిపోయింది. గతేడాది ఇదే సమయంలో 26 వేల 850 యూనిట్ల గృహాలు అందుబాటులోకి రాగా ప్రస్తుతం మాత్రం కేవలం 10 వేల 480 యూనిట్లకు పరిమితమైంది.దీంతో 61% క్షీణత నమోదైంది.
జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఏకంగా 29 శాతం సేల్స్ పడిపోయాయి. 7 ప్రధాన మెట్రో నగరాల్లో కలిపి ఇళ్ల అమ్మకాలు 29 శాతం తగ్గి 27 వేల 451కి పడిపోయాయి. అమ్మకం కాని ఇన్వెంటరీస్ 3.65 లక్షలకు పెరిగాయి. ఇది జేఎల్‌ఎల్ నివేదిక. కరోనా ప్రభావం వల్ల హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాల తగ్గుదల ఏకంగా 41 శాతం పడిపోయింది.హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో మూడు నెలల కాలంలో 3 వేల 027 ఇళ్లు మాత్రమే విక్రయమయ్యాయి. అమ్మకాల క్షీణతలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది.
ఇళ్లు కొనేవారు లేక… ప్రాజెక్టులపై పెట్టిన పెట్టుబడులు వెనక్కిరాక.. రియల్ కంపెనీలు దివాళా అంచుకు
చేరుకున్నాయి. ఇప్పటికే 3.65 లక్షల కోట్ల విలువైన ఇళ్లు కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నా… కొనేవారు
లేరు. గతేడాది ఇదే త్రైమాసికంలో 38 వేల 628 నివాస గృహ విక్రయాలు జరగగా… ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో
అమ్మకాలు 27 వేల 451కి పడిపోయాయి.
ఇంటి సేల్స్ పడిపోయిన నగరాల్లో బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 52 శాతం పడిపోయి 4 వేల 186 యూనిట్లుగా ఉంది. రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్‌లో 41 శాతం తగ్గి కేవలం 3 వేల 27 యూనిట్లు అమ్ముడయ్యాయి. కోల్‌కతాలో 35 శాతం తగ్గి 1259, ముంబైలో 19 శాతం తగ్గి 6 వేల 857, ఢిల్లీ ఎన్సీఆర్‌లో 18 శాతం తగ్గి 5 వేల 941, పుణేలోను 18 శాతం తగ్గి 3,728, చెన్నైలో 8 శాతం తగ్గి 2,453కి పడిపోయాయి.
2020 మొదటి మూడు నెలల్లో అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. అదే సమయంలో కొత్తగా ప్రారంభమైనవి 3 శాతం పెరిగి 40 వేల 574కు పెరిగాయి. అమ్ముడుకాని ఇన్వెంటరీలు 2019 డిసెంబర్ నాటికి 4 లక్షల 42 వేల 228 యూనిట్లుగా ఉండగా, ఇప్పుడు అవి 4 లక్షలా 55 వేల 351కు పెరిగాయి. దేశవ్యాప్తంగా మార్చి చివరి నాటికి టాప్ 7 నగరాల్లో డెవలపర్లకు చెందిన 3 లక్షల 65 వేల ఒకవంద కోట్ల పెట్టుబడులు అలాగే ఉండిపోయాయి.
కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి తీవ్రంగా దెబ్బతింది. చైనాలోని ప్రాపర్టీ మార్కెట్‌లో పరిస్థితులు పూర్తిగా దిగజారాయి. తీవ్ర మాంద్యం మధ్య రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇప్పుడు పుచ్చకాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను చెల్లింపులుగా కస్టమర్ల నుంచి అంగీకరించడం మొదలుపెట్టాయి.
చైనా టైర్-3, 4వ నగరాల్లోని రియల్టర్లు కొత్తగా నిర్మించిన ఇళ్లను కొనుగోలు చేయడానికి రైతులను ఆకర్షించే ప్రయత్నంలో, గోధుమలు, వెల్లుల్లితో పాటు కొంత నగదును అంగీకరిస్తున్నాయి. డిమాండ్ లేకుండా అర్థాంతరంగా నిలిచిపోయిన ప్రాపర్టీలను వదిలించుకోవటానికి రియల్టర్లు ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. చైనా పౌరులు రియల్ ఎస్టేట్ రంగానికి దూరంగా ఉంటూ.. అనిశ్చిత ఆర్థిక వాతావరణంలో నగదు నిల్వ చేయడానికి ఇష్టపడుతున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్‌ల వల్ల వినియోగదారుల నుంచి వ్యాపార విశ్వాసం దెబ్బతినడంతో
రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్‌ను రక్షించే ప్రయత్నాలను చైనా వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా.. చైనా
బ్యాంకులు దీర్ఘకాలిక రుణాల కోసం కీలక వడ్డీ రేటును రికార్డు మొత్తంలో తగ్గించడం లాంటి వాటితో రియల్ ఎస్టేట్
రంగాన్ని ప్రోత్సహించడానికి చైనా అనేక చర్యలు తీసుకుంది.
బ్యాంక్ లోన్ రేట్లు తగ్గింపు వల్ల తనఖా ఖర్చుల భారం కంపెనీలపై తగ్గింది. బలహీన రుణ డిమాండ్‌ను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా, మొదటి-గృహ కొనుగోలుదారుల మార్టగేజ్ కోసం కనీస వడ్డీ రేటును తగ్గించింది. ఇది 4.6% నుంచి 4.4% కంటే తక్కువ వడ్డీ రేటుతో లోన్ పొందేందుకు వీలు కల్పిస్తోంది.వినియోగదారులకు డబ్బు ఇన్వెస్ట్ చేయటం, పొదుపు చేయటానికి రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక మంచి ప్రత్యామ్నాయం. ఇప్పుడు డెవలపర్లతో పాటు కొనుగోలు దారులు సైతం బ్యాంకుల నుంచి తక్కువ రేట్లకు లోన్స్
తీసుకునేందుకు మక్కువ చూపుతున్నారని తెలుస్తోంది. అయితే చైనాకు మంచి రోజులు గత సంవత్సరంలో ముగిశాయని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం చైనా కంపెనీల గృహ రుణం దాదాపు 10 ట్రిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది.
చైనాలో దాదాపు 27% బ్యాంకు రుణాలు రియల్ ఎస్టేట్‌తో ముడిపడి ఉన్నాయని థింక్ ట్యాంక్,
పాలసీ రీసెర్చ్ గ్రూప్ తమ నివేదికలో పేర్కొన్నాయి.
చైనా పాటిస్తున్న జీరో-కోవిడ్ వ్యూహం కారణంగా జనవరి- జూన్ మధ్య చైనా ఆస్తి అమ్మకాలు 25 శాతం తక్కువగానే
ఉన్నాయి. చైనాకు మంచి రోజులు గత సంవత్సరమే అయిపోయాయని నిపుణులు అంటున్నారు. చైనీస్ రియల్
ఎస్టేట్ డెవలపర్లు మార్కెట్ మందగమనం, బాండ్ డిఫాల్ట్‌లు పెరగడంతో ప్రాపర్టీలకు డిమాండ్ పెంచేందుకు చివరికి
గోధుమ, వెల్లుల్లి వంటి ఆహార ఉత్పత్తులను డౌన్‌పేమెంట్‌లుగా అంగీకరించటాన్ని చూస్తే చైనాలో పరిస్థితులు ఎంత
దారుణంగా తయారయ్యాలో అర్థమౌతోంది. పైకి డ్రాగన్ అంతా బాగున్నట్లే చెబుతున్నప్పటికీ.. ఆర్థిక వ్యవస్థలో
డొల్లతనం కనిపిస్తోంది.
చైనాలో దాదాపు 80 శాతం కుటుంబాలకు సొంతిళ్లు ఉన్నాయి.అయితే, నివాసాల మార్కెట్ విషయంలో ప్రభుత్వం
చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, ప్రస్తుతం చైనా జీడీపీలో అయిదో వంతు
ఈ రంగానిదే. ఏమాత్రం పొరపాటు జరిగినా అది సంక్షోభానికి దారితీసే అవకాశం ఉంటుంది. జిన్ పింగ్ ప్రభుత్వం
ప్రతిపాదించిన నూతన పన్ను విధానం అమల్లోకి వస్తే… పట్టణ ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ ఇళ్లున్నవారిలో 20
శాతం మందికి పైగా తమ ఖాళీ గృహాలను అమ్మేందుకు సిద్ధపడతారని ఎఫ్‌టీ కాన్ఫిడెన్షియల్ రీసెర్చ్ అనే సంస్థ
నిర్వహించిన సర్వేలో తేలింది. దాంతో ఇళ్ల ధరలు ఒక్కసారిగా పతనమయ్యే అవకాశం ఉంది. ఫలితంగా రియల్ ఎస్టేస్
రంగం తీవ్రంగా కుదేలయ్యే పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనా పరిస్థితి ప్రపంచ దేశాలకు
కూడా హెచ్చరికే అంటున్నారు విశ్లేషకులు. మన దేశంలో హదరాబాద్ లాంటి నగరాల్లో కూడా రియల్ పతనం
మొదలైందని, ఇక్కడ కూడా అవసరానికి మించి విచ్చలవిడిగా నిర్మాణాలు చేశారని గుర్తుచేస్తున్నారు. చైనా అనుభవం
మనకు రాకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం చాలా ఉంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొన్నాళ్లుగా రేసు గుర్రంలా
దూసుకెళ్తోంది. ఇప్పుడు సీన్ రివర్సౌతున్న సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి.
రియల్ ఎస్టేట్ రంగంలో సంక్షోభం వస్తే ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలున్నాయి. 2008లో అమెరికాలో వచ్చిన
మాంద్యం.. హౌసింగ్ లోన్స్ రీపేమెంట్ ఫెయిల్యూరే కారణం. ఇప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినా
ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే ప్రపంచం మొత్తంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. మనం కూడా జాగ్రత్తపడకపోతే
రియల్ సంక్షోభానికి సిద్ధంగా ఉండాల్సిందే.
గ్రేటర్ హైదరాబాద్ లో అపార్ట్మెంట్ ల అమ్మకాలు నత్తనడకన సాగుతున్నాయి.డిమాండ్ అండ్ సప్లై సూత్రాన్ని మరచిన
బిల్డర్స్ ,డెవలపర్స్ వెంచర్ల ఓనర్లు అత్యాశ దెబ్బకు హైదరాబాదు చుట్టూ అక్షరాల లక్షకు పైగా అపార్ట్మెంట్ లు ఇప్పుడు
అమ్ముడు పోక ఖాళీగా పడున్నాయి. కొనుగోలు దారుల ప్రియార్టీలను పట్టీంచుకోండా తాము కట్టింద స్వర్గమన్న
ఆలోచనలతో నిర్మించిన అపార్ట్మెంట్ లు ఇప్పుడు అమ్ముడు పోకపోవడంతో హైదరాబాద్ లో రియల్టర్లు ఇప్పుడు
దిక్కు తోచని స్థితి లో పడ్దారు.
దశాబ్ధకాలంగా ఎన్నడు లేని విధంగా IT బూమ్ వల్లనో, పరిశ్రమల ఏర్పాటు..తో పాటు అనే క కారణాల
వల్ల.అంతర్జాతీయ స్థాయి కంపెనీల పెట్టుబడులకు హైదరాబాదు కేంద్రంగా మారింది.ఈ పాజిటివ్ అంశాలను
రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపరులు తమ రియాల్టీకు అనుకూలంగ్ అమలుచుకుని గత కొన్నేల్లుగా హైదరాబాద్ లో
ఎన్నడు లేనంతగా అపార్ట్మెంట్ లు..ఇండివిడ్యువల్ హౌస్ లనిర్మాణాలను పెంచేసారు…అయితే మార్కెట్ ఎప్పుడూ
ఒకేలా వుండదన్న వ్యాపార సూత్రాన్ని పాటించడమ్ లో మాత్రమ్ గ్రేటర్ రియల్టర్ లు విఫలమయ్యారు..
దేశవ్యాప్తంగా కరోనా ఎఫ్ఫెక్ట్ కు అనేక రంగాల పరిస్థితి తారుమారు అయ్యిందన్నది ఓపెన్ సీక్రెట్..అయితే
హైదరాబాదు లోని రియల్టర్లంతా కరోనా సమయంలో కూడా అపార్ట్మెంట్ ల అమ్మకాలలో హైదరాబాద్ దుమ్ము
దులిపిందన్న ఓవర్ పబ్లిసిటీ తో గ్రేటర్ లో కృత్రిమ వ్యాపారాన్ని సృష్టించారు..ఇప్పుడు అదే రియల్టర్ల పాలిట శాపంగా
మారిందని ట్రేడ్ వర్గాలు చెబుతిన్నాయి.దీంతో మిడిల్ క్లాస్..ఎబౌవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీల సొంతి ఇంటికలను
నెరవేర్చుకోవడానికి బిల్డర్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడుతున్నారు.
GHMC,HMDA,DTCP పరిధిలో ఇప్పుడు లక్షాలాది అపార్ట్మెంట్ లు అమ్ముడుపోకుండా ఖాళీ గా వున్నాయని రియాల్టీ
నిపుణులు లెక్కలు చెబుతున్నారు.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ వెస్ట్ ప్రాంతాలైన
గచ్చిబౌలి..నార్శిగ్..కోకాపేట..ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్.. కొండాపూర్ మాదాపూర్..తెల్లాపూర్..గోపన పల్లె హైటెక్
సిటీ..కూకట్పల్లి.. మియాపూర్, లలో ఇప్పుడు ఫ్లాట్స్ అమ్మకాలు జరుగక అనేక చోట్ల ఖాళీ గా దర్శమిస్తున్నాయి..కరోనా
వున్న రెండేళ్ల కాలం లో సైలెంట్ మార్కెట్ ను క్యాస్ చేసుకుందామని ప్రీలాంచ్ ఆఫర్లు ప్రకటించి…బయ్యర్ల నుండి
అడ్వాన్స్ లు తీసుకోని…ఇంకా ఇప్పటి కీ నిర్మాణమ్ ప్రారంభించని అపార్ట్మెంట్ల ప్రాజెక్టు లు హైదరాబాదు లో వేలల్లో
వున్నాయి.
హైదరాబాద్ డెవలపర్లు మార్కెట్ గమనాన్ని సరిగ్గా అంచనా వేయడం లో ఘోరంగా విఫలమయ్యారా??? యస్
అలానే కనిపిస్తోంది..గ్రేటర్ లో ఏయే విభాగంలో ప్రస్తుతం ఎక్కువ ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి? వాటి
అమ్మకాలు ఎలా జరుగుతున్నాయి? ప్రస్తుతమున్న స్టాక్ అమ్ముడు కావాలంటే ఎంతకాలం పడుతుంది? అదే
విభాగంలోకి ఎన్ని కొత్త ప్రాజెక్టులు ఆరంభమవుతాయి? అన్న మార్కెట్ సూత్రాలను పక్కన పెట్టి దీపముండగానే గల్లా
పెట్టె నింపుకోవాలన్న రియల్ వ్యాపారుల ఆలోచనే ఇప్పుడు హైదరాబాదు లో లక్షకు పైగా అమ్ముడు పోని
అపార్ట్మెంట్ ల పాలిట శాపం గా మారింది……
ఓన్లీ బిజినెస్…నో ప్లానింగ్…ఎక్కడైనా .ఓప్రాజెక్ట్ ప్రారంభించాలి అంటే దాని లాభారిష్టాలు ఏంటన్న లెక్కలు వేయడమ్
కామన్..కానీ హైదరాబాదు రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారులు మాత్రం ఈ అంచనాలు వేసి ప్రాజెక్టులు పూర్తి
చేయడం లొమాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారని చెప్పొచ్చు. కేవలం స్థలం దొరికితే చాలు అన్నట్లుగా కొత్త ప్రాజెక్టుల్ని
ఆరంభించి…భూమి పూజలు చేసిమ్..పిల్లర్లు..లేపి అడ్వాన్స్ లు తీసుకోవడం తో సరిపెట్టారు కొంతమంది…మరి
కొంతమంది మాత్రం ప్రీ లాంచ్ ఆఫర్లతో బయ్యర్లను ఆకర్షించి సగమ్ కి పైగా నిర్మాణాలు జరిపారు.. ఇక బడా రియాల్టీ
బాసులైతే చెప్పినవన్ని పూర్తి చేసినా కానీ మార్కెటింగ్ చేసుఓవడం లో వెనుకబడ్డారు..దీనితో హైదరాబాద్ రియల్
రంగంలో అమ్ముడు కాని ఫ్లాట్ల సంఖ్య ఎంతలేదన్నా లక్ష దాకా ఉన్నాయి.
గృహ రుణ వడ్డీ రేట్ల పెరుగుదల, నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల కూడా రియల్ మార్కెట్ పడకేయడానికి ప్రధాన
కారణం. సొంతిల్లు కోసం చూసేవారికంటే.. పెట్టుబడులు పెట్టేవారే రియల్ మార్కెట్ కు మహారాజపోషకుల. వడ్డీరేట్లు
ఎప్పుడైతే పెరిగాయో.. సెకండ్ ఇన్వెస్ట్ మెంట్ పెట్టేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. అద్దెలతో పోలిస్తే ఈఎంఐ
భారంగా మారడంతో ఇళ్ల కొనుగోలుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఏదేమైనాచైనా అనుభవాల నుంచి పాఠాలు
నేర్చుకోకపోతే.. మన దగ్గర కూడా రియల్ బుడగ పేలుతుంది. అప్పుడు లక్షల మంది జీవనోపాధిపైనా ప్రభావం
తప్పదు.