దేశంలో ధరలు మండిపోతున్నాయి. చమరు సెగ ఓవైపు, గ్యాస్ రేటు మరోవైపు భయపెడుతున్నాయి. ఇవి చాలదన్నట్టు నిత్యావసరాలు కూడా రోజుకో రకంగా పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం కూడా వణికిస్తోంది. ప్రజల కొనుగోలు శక్తి కూడా పడిపోయిందని ఎఫ్ఎంసీజీ కంపెనీల నివేదిక చూస్తుంటే.. మాంద్యం ముంచుకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవే పరిస్థితులున్నాయి. 2008 నాటి మాంద్యం కాదు.. 1930 నాటి మహామాంద్యం తరహా ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికలు అన్ని దేశాల్నీ అల్లాడిస్తున్నాయి. అమెరికా నుంచి ఆఫ్రికా […]
కోటగిరి శ్రీధర్. ఏలూరు వైసీపీ ఎంపీ. సీనియర్ పొలిటీషియన్ కోటగిరి విద్యాధరరావు వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన శ్రీధర్.. తండ్రి స్థాయిలో ప్రభావం చూపడం లేదన్నది అనుచరుల మాట. 2019లో ఎంపీగా గెలిచాక.. నియోజకవర్గ పరిధిలోనే నల్లపూస అయిపోయారు. అప్పుడప్పుడూ వైసీపీ కార్యక్రమాలకు హాజరు కావడమే తప్ప.. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా పెద్దగా కనిపించని పరిస్థితి. అలాంటి శ్రీధర్.. కొత్త కొత్త కామెంట్స్‌తో చర్చల్లో వ్యక్తిగా మారిపోయారు. కీలక అంశాలనే టచ్ చేస్తూ.. కొత్త ప్రశ్నలకు […]
ఉత్తరాంధ్రలో కీలకంగా ఉండే ఉమ్మడి విజయనగరం జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. అధినేతలు సైతం ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపించేవారు. రోజులన్నీ ఒకేలా ఉండవన్నట్టు రాజకీయం మారిపోయింది. 2014 ఎన్నికల తర్వాత అది స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినా.. పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు శిబిరంలో కొందరు… ఆయనంటే గిట్టని వారు మరో శిబిరంలో చేరిపోయారు. 2014లో టీడీపీ గెలిచాక.. జిల్లా ఇంఛార్జ్ […]
తెలంగాణ కాంగ్రెస్‌లో వివాదాలు కామన్. ఒకరు ఎడ్డెం అంటే.. ఇంకొకరు తెడ్డం అంటారు. గట్టిగా ప్రశ్నిస్తే.. అంతర్గత ప్రజాస్వామ్యం.. భిన్నాభిప్రాయాలు అనే డైలాగులు వినిపిస్తారు. అయితే తరచూ ఇలాంటి అంశాలు చర్చగా మారడంతో.. వాటికి స్వస్తి పలకాలని నిర్ణయించారా అనే ప్రచారం జరుగుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క మధ్య సఖ్యత లేదని గుర్తించి.. వారిని ఢిల్లీకి పిలిచి మాట్లాడారనే వాదన వినిపిస్తోంది. పార్టీలో ఇటీవల పెద్ద దుమారం రేగింది. పీసీసీ […]
నగరి వైసీపీ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. మంత్రి రోజాపై… వైసీపీలోని ఆమె వ్యతిరేక వర్గం మళ్లీ కత్తులు దూస్తోంది. కొద్దిరోజులుగా సైలెంట్ అయ్యి కొత్త చర్చకు దారితీసిన వాళ్లంతా పాత పద్ధతిలోకి వచ్చేశారు. సై అంటే సై అంటున్నారు. తాడో పేడో తేల్చుకుంటామని సవాళ్లు విసురుతున్నారు. రోజా మంత్రి అయినా వెనక్కి తగ్గేదే లేదన్నట్టుగా మాటల తూటాలు పేల్చుతున్నారు అసమ్మతి నేతలు. 2014లో నగరి నుంచి రోజా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో ప్రతిపక్ష పాత్రకే పరిమితం. […]