తెలంగాణ కాంగ్రెస్‌లో ఒకప్పుడు పీజేఆర్ బలమైన నాయకుడు. ఆయనకంటూ సొంత ఇమేజ్ ఉండేది. పార్టీలో హైదరాబాద్ ప్రస్తావన వస్తే.. పీజేఆర్ పేరు చర్చకు వచ్చేది. పీజేఆర్ మరణం తర్వాత ఆ ఇమేజ్ను సొంతం చేసుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చారు ఆయన తనయుడు విష్ణువర్దన్‌రెడ్డి. ఎమ్మెల్యేగానూ చేశారు. గత రెండు ఎన్నికల్లో నెగ్గుకు రాలేక ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమయంలో పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి వైసీపీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత టీఆర్ఎస్లో చేరి […]
అది 2015 నవంబర్. చిత్తూరు మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్‌లను మున్సిపల్ కార్యాయలంలోనే ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనం. కటారి దంపతుల దగ్గరి బంధువైన చింటూనే కీలక సూత్రధారిగా అభియోగాలు నమోదు చేశారు పోలీసులు. కోర్టు విచారణలో ఉన్న కేసును ఈ నెల 30కి వాయిదా వేశారు. విచారణలో భాగంగా సాక్ష్యులకు సమన్లు వెళ్లాయి. ఇదే కేసులో వైసీపీ నేత బుల్లెట్ సురేష్ కూడా నిందితుడిగా ఉన్నారు. […]
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో వైసిపి నేత గంజి ప్రసాద్ హత్య రాష్ట్రంలో కలకలం రేపింది. అధికారపార్టీలో ఆధిపత్యపోరు చర్చకు వచ్చింది. నిందితులను వదిలిపెట్టేది లేదని హోంమంత్రి తానేటి వనిత ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో పోలీసుల పనితీరుకు మంత్రి స్టేట్మెంట్కు పొంతన ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిందితులను అరెస్ట్ చేసినా.. రాజకీయ ఒత్తిళ్లతో విచారణ ముందుకెళ్లడం లేదని పార్టీలోని ఒక వర్గం ఆరోపిస్తోంది. దానికితోడు నిందితులతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తున్నారు నాయకులు. రిమాండ్‌లో ఉన్న […]
మొక్కై వంగనిది మానై వంగుతుందా..? ప్రస్తుతం హిందూపురం వైసీపీలో పరిస్థితి అలాగే ఉంది. మూడేళ్ల క్రితం మొదలైన వర్గపోరు చినికి చినికి గాలి వాన కాదు.. పెద్ద తుఫానుగా మారిపోయింది. ఛాన్స్ దొరికితే చాలు కొట్టేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన మహ్మద్ ఇక్బాల్.. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనంటే నియోజకవర్గంలోని మరో వర్గానికి అస్సలు పడటం లేదు. ఇన్నాళ్లూ ఏదో ఒక రూపంలో అసమ్మతి తెలియజేసినా.. ప్రస్తుతం మాత్రం ఆ సెగలు రోడ్డెక్కడంతో […]
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్లోని కొందరు నేతలకు సీటు భయం పట్టుకుంది. పార్టీ ఫిరాయించేందుకు ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు నాయకులు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిన నేతలు ప్రస్తుతం టీఆర్ఎస్లోనే ఉండిపోయారు. అలాంటి వారంతా భవిష్యత్‌పై బెంగ పెట్టుకుని పక్క పార్టీలో బిస్తర్ వేసుకుంటున్నారు. గతంలో అశ్వారావుపేట నుంచి పోటీ చేసిన ఓడిన తాటి వెంకటేశ్వరరావు టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఇదే బాటలో మరికొందరు ఉన్నట్టు […]