తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారతాయా..?కాంగ్రెస్, షర్మిల పార్టీ పొత్తు పెట్టుకుంటాయా..? వైఎస్ ఆశయాల కోసం కలిసి పనిచేస్తాయా..?రెడ్డి సామాజికవర్గాన్ని తమవైపు తిప్పుకుంటాయా..?టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బలమైన కూటమి వస్తుందా..? కొత్త కూటమి..! తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మారుతున్న పరిణామాలు చూస్తే.. కాంగ్రెస్, షర్మిల పార్టీతో అవగాహన కుదుర్చుకోవచ్చనే వాదన వినిపిస్తోంది. వైఎస్, రెడ్డి సామాజికవర్గ ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేస్తే.. టీఆర్ఎస్ కు గట్టి ఫైట్ ఇవ్వొచ్చనే ఆలోచన మొదలైంది. అవసరమైతే లెఫ్ట్ […]
దుర్గం చిన్నయ్య. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే. సింగరేణి పట్టాల పంపిణీ ఆయనకు నిద్ర లేకుండా చేస్తోందట. ఈ అంశంలో ఇన్నాళ్లూ అదిగో ఇదిగో అని ప్రచారం ఊదరగొట్టింది ఆయనే. జిల్లాలోని మిగిలిన రెండు నియోజకవర్గాల్లో అక్కడి శాసనసభ్యులు పట్టాల పంపిణీ జోరు పెంచితే.. బెల్లంపల్లిలో ఎక్కడో బెడిసి కొట్టిందట. అందుకే తెగ ఆందోళన చెందుతున్నారట ఎమ్మెల్యే చిన్నయ్య. సింగరేణిలో పనిచేసి అక్కడే తమ నివాసం ఏర్పాటు చేసుకున్న రిటైర్డ్ కార్మికులు.. స్థానికులకు సైతం పట్టాలు అందజేస్తున్నారు. […]
ఆపరేషన్ వరంగల్. ఈ మధ్య కాలంలో ఓరుగల్లు రాజకీయాల్లో బలంగా చర్చల్లో ఉన్న మాట. ఉమ్మడి జిల్లాలో పట్టు కోల్పోకుండా టీఆర్ఎస్.. బలపడేందుకు బీజేపీ వేస్తున్న ఎత్తులే పొలిటికల్ కలర్స్‌ను మార్చేస్తున్నాయి. జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టడంతోపాటు.. ఎదుటి శిబిరంలో కాస్త ప్రజాదరణ ఉన్న నేతను.. తమవైపు లాగేందుకు చిత్ర విచిత్ర వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం రాష్ట్రానికి వచ్చిన ఆ పార్టీ జాతీయ నాయకుల్లో కొందరు 12 […]
తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికలతో ఊపు తెద్దాం అనేది స్ట్రాటజీ. అదే చేరికల అంశంలో సీఎల్పీ నేత భట్టి పంచాయితీ ముగిసిందో లేదో మరో కొత్త రగడ బయకొచ్చింది. గాంధీభవన్‌లో మాజీ మేయర్ ఎర్ర శేఖర్ చేరిక పూర్తి కాకముందే.. స్టార్ క్యంపైనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఎర్ర శేఖర్ చేరికను తప్పు పట్టారు. అధిష్ఠానానికి లేఖ రాయబోతున్నారు కూడా. నేర చరిత్ర ఉన్న వాళ్లను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ఏంటనే లొల్లి మొదలైంది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యంతరం వెనక […]
పెన్నా నది పరివాహక ప్రాంతం కావడంతో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో భూములకు డిమాండ్ ఎక్కువ. నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం.. కొడవలూరు.. కోవూరు.. విడవలూరు మండలాల్లో గ్రావెలతోపాటు ఇసుక అధికంగా లభిస్తుంది. ఇవే స్థానిక వైసీపీ నేతలకు కాసులు కురిపిస్తున్నాయి. ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం సైతం ప్రస్తుతం చర్చగా మారింది. అధికారపార్టీ వర్గాల్లోనే కుమ్ములాటలకు.. వర్గపోరుకు.. కేడర్‌కు ఎమ్మెల్యేకు మధ్య దూరం పెరగడానికి కారణమైందని చెబుతున్నారు. కోవూరు నియోజకవర్గంలోని మండలాలకు పార్టీ నేతలను ఇంఛార్జులుగా నియమించారు […]
బొంతు రామ్మోహన్. GHMC మాజీ మేయర్. ఇక్కడ చూస్తున్నది ఆయన పుట్టినరోజు వేడుకలే. గతంలో కూడా ఆయన బర్త్‌డే వేడుకలు చేసుకున్నా.. ఈ ఏడాది మాత్రం స్పెషల్‌గా చెబుతున్నారు. పుట్టినరోజు వేడుకలను బలప్రదర్శనకు వేదికగా మార్చేసి పార్టీలో చర్చగా మారారు మాజీ మేయర్. వచ్చే ఎన్నికల్లో ఆయన ఉప్పల్ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. అందుకోసమే ఈ ఎత్తుగడలు.. అనుచరులతో పరేడ్లు అని టీఆర్ఎస్లో చర్చ సాగుతోంది. వాస్తవానికి మేయర్‌గా ఉన్న సమయంలోనే ఉప్పల్ నుంచి ఎమ్మెల్యేగా […]
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ తర్వాత తెలంగాణలో వరస కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు కమలనాథులు. హైదరాబాద్‌లో మీటింగ్స్ ముగిసిన 24 గంటల్లోనే మూడు కమిటీలు ప్రకటించి తమ దూకుడేంటో తెలియజెప్పారు. వీటిల్లో చేరికల కమిటీ పెద్ద చర్చకే దారితీస్తోంది. మొన్నటి వరకు ఆ చేరికల కమిటీకి బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి నేతృత్వం వహించారు. తాజాగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సారథ్యంలో చేరికల కమిటీని సిద్ధం చేసింది ఢిల్లీ నాయకత్వం. […]