పొలిటికల్ అటెన్షన్ కోసం బీజేపీ ఆపసోపాలు ఏపీలో బలపడేందుకు నానా తంటాలు పడుతోంది బీజేపీ. వచ్చే ఎన్నికల నాటికి బలమైన శక్తిగా మారాలని ఎన్నెన్నో ప్రణాళికలు వేస్తోంది. కానీ.. అవేమీ వర్కవుట్ కావడం లేదు. రెండు మూడు రోజులకే వేడి చల్లారిపోతోంది. తర్వాత వాటి గురించి.. బీజేపీ గురించి ప్రజలు ఆలోచించే పరిస్థితి ఉండటం లేదు. దీంతో ప్రజల్లో పొలిటికల్ అటెన్షన్ తీసుకొచ్చేందుకు ఏం చేయాలో కమలనాథులకు పాలుపోవడం లేదట.
ప్లాన్స్ వర్కవుట్ కావడం లేదా? ప్రస్తుతం రాష్ట్రంలో రెండు బలమైన ప్రాంతీయ పార్టీలతోపాటు చరిష్మా ఉన్న జనసేన ఉన్నాయి. ఈ మూడు పార్టీలను దాటుకుని బీజేపీ ముందుకెళ్లాలి. స్పేస్ చూసుకుని ప్రజల్లోకి వెళ్లాలంటే చాలా కష్టపడాలి. ప్రస్తుతం జనసేన మిత్రపక్షంగా ఉంది. అయినప్పటికీ.. సొంతంగా బీజేపీ ఇమేజ్ పెంచుకోవడం ఎలాగో అర్థం కావడం లేదట. దూకుడు పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలే వర్కవుట్ కావడం లేదట. తెలంగాణలో పోటీపడాలని అనుకున్నా మిస్ మ్యాచ్
తెలంగాణ మాదిరి ఏపీలోనూ ప్రభుత్వంపై దూకుడుగా వెళ్తేకానీ.. ప్రజల్లోకి వెళ్లలేమన్నది పార్టీ అభిప్రాయం. దానికి తగ్గట్టే కార్యక్రమాలను ప్లాన్ చేసుకుంటున్న పరిస్థితి. అయితే ఏపీలో బీజేపీకి చరిష్మా ఉన్న నాయకులు లేకపోవడంతో ఏ కార్యక్రమం చేసినా రిజిస్టర్ కావడం లేదట. ఏపీతో పోల్చితే తెలంగాణలో బీజేపీ ఎంతో ముందు ఉంది. ఆ మధ్య జరిగిన బీజేపీ ముఖ్య నాయకుల భేటీలో ఇదే అభిప్రాయం వ్యక్తమైందట. ఇలా ఒక్కసారి కాదు.. చాలాసార్లు అనుకున్నారు. అనుకుంటూనే ఉన్నారు. కానీ ఎక్కడా మ్యాచ్ అవడం లేదు.
కోర్ కమిటీ ఒకటి అరా సమావేశాలు తెలంగాణలో బండి సంజయ్ రెండోవిడత పాదయాత్ర మొదలు కావడానికి ముందు కూడా ఏపీలో బీజేపీ నేతలు సమావేశం అయ్యారట. ఆ స్థాయి కార్యక్రమాలు ఏపీలోనూ మొదలుపెట్టాలంటే ఏం చేయాలనే దానిపై చర్చ జరిగినట్టు సమాచారం. వాస్తవానికి ఏపీ బీజేపీకి మరిన్ని జవసత్వాలు తీసుకొస్తారని ముఖ్యనాయకులతో కోర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కోర్ కమిటీ ఒకటి అరా సమావేశాలు నిర్వహించినా తర్వాత పత్తా లేదు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి బలమైన నిర్ణయం తీసుకున్న ఉదంతమూ లేదు. పార్టీ ఎదగడానికి టర్నింగ్ పాయింట్ ఎలా?
ఆ మధ్య ఉత్తరాంధ్రలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు యాత్ర చేపట్టారు. వినూత్నంగానే కార్యక్రమం నిర్వహించినా.. దాని ప్రభావం ఆశించిన స్థాయిలో కనిపించ లేదు. పైగా అధికార వైసీపీ.. విపక్ష టీడీపీలు తమను ప్రత్యర్థిపార్టీగానే చూడటం లేదని తెగ ఫీలవుతున్నారట. ఒకవేళ ఆ పార్టీలు తమను ప్రత్యర్థిగా భావిస్తే కొంత స్పేస్ లభిస్తుందని.. అందులో దూరిపోవచ్చని అభిప్రాయపడుతున్నారట. అయితే రాష్ట్రంలో పార్టీ ఎదగడానికి ఏదో ఒక టర్నింగ్ పాయింట్ కావాలి. ఆ టర్నింగ్ పాయింట్ కోసం ఎదురు చూడటమే సరిపోతోంది. ఒకవేళ ఏదైనా పాయింట్ చిక్కినా.. పార్టీ నేతలు చేపట్టే పోరాటం రెండు మూడు రోజులకే చల్లారిపోతోంది. తర్వాత దాని గురించి మాట్లాడే వారే ఉండరు. ఇది కూడా ఏపీలో బీజేపీకి పెద్ద మైనస్‌గా అభిప్రాయపడే పార్టీ నేతలూ ఉన్నారు.
కేంద్రమంత్రుల వరస పర్యటనలు ఈ రెండు నెలలు ముగ్గురు లేదా నలుగురు కేంద్ర మంత్రులు ఏపీకి వస్తున్నట్టు సమాచారం. వారి పర్యటనల ద్వారా పొలిటికల్ మైలేజ్ సాధించే వ్యూహాల్లో ఉన్నారట. అయితే తమకు ఎదురవుతున్న పరిస్థితులు చూశాక పెద్దగా ఆశల్లేవంటున్నారు కొందరు నాయకులు.
Watch Here : https://youtu.be/9pTYnfah2hE