తెలంగాణ కాంగ్రెస్‌లో నల్గొండ జిల్లా నుండే మోస్ట్ సీనియర్స్ ఎక్కువ. కాంగ్రెస్‌కి పట్టున్న జిల్లా కూడా ఇదే. నాయకులు… నాయకత్వం ఎక్కువ ఇక్కడే ఉంది. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ప్రస్తుతం నల్గొండ ఎంపీగా ఉన్నారు. హుజూర్నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత హుజూర్నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పీసీసీ చీఫ్ పదవి నుంచి రిలీవ్ అయిన తర్వాత హుజూర్‌నగర్‌పై […]
నిజామాబాద్ కమలంలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. రెండు, మూడు వర్గాలుగా నాయకులు.. కార్యకర్తలు విడిపోయారు. ఎప్పటి నుంచో ఉన్న అంతర్గత విభేదాలు ముదురుపాకాన పడుతున్నాయి కూడా. ఇందుకు హనుమాన్ శోభాయాత్రలో జరిగిన గొడవలే తీవ్రతను తెలియజేస్తున్నాయి. బీజేపీలో గొడవలు సమసి అంతా గాడిన పడుతున్నారని అనుకుంటున్న తరుణంలో ముఖ్య నాయకులే రోడ్డెక్కి చొక్కాలు పట్టుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పార్టీకి కాస్త పట్టుందని భావిస్తున్న అర్బన్‌లో పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో పార్టీ […]
వారసులను జనాల్లోకి వదిలేందుకు విజయనగరం జిల్లాలోని సీనియర్ పొలిటీషియన్స్ వేయని ఎత్తుగడ లేదు. మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఇలా పలువురు ప్రజాప్రతినిధులు.. తమ ఇంటి నుంచే భవిష్యత్‌లోనూ పొలిటికల్ యాక్టివిటీస్ కొనసాగాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో వారు చేపడుతున్న పనులు.. రచిస్తున్న వ్యూహాలు ఆసక్తిగా ఉంటున్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్.. డాక్టర్. సందీప్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బొత్స పెద్ద […]
గ్రేటర్ హైదరాబాద్ నేతలతో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సన్నాహక సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలు పార్టీలో చర్చగా మారాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉప్పల్ నియోజకవర్గ పంచాయితీ బట్టబయలైంది. నియోజకవర్గ పరిధిలో ఎవరి పర్యవేక్షణలో కార్యక్రమాలు జరగాలన్నదానిపై చర్చ హీటెక్కించిందట. దాని చుట్టూనే ప్రస్తుతం పార్టీ వర్గాల చెవులు కొరుకుడు ఎక్కువైంది. ఎమ్మెల్యే పర్యవేక్షణలోనే కార్యక్రమాలు జరగాలని ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి ప్రతిపాదించారట. ఆ మాటలు వినగానే కేటీఆర్ తీవ్ర అసంతృప్తి […]
కర్నూలు జిల్లా ఆదోని ఒకప్పుడు టీడీపీకి బాగా పట్టున్న నియోజకవర్గం. ప్రస్తుతం ఆదోని టీడీపీ ఇంచార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు కొనసాగుతున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ 42 వార్డులకు గాను.. టీడీపీకి దక్కింది ఒక్క వార్డే. 5 గ్రామ పంచాయతీలలోనే టీడీపీ మద్దతుదార్లు గెలిచారు. రెండు ఎంపీటీసీలు దక్కాయి. పరిస్థితి ఈ విధంగా దిగజారిపోయినా పార్టీ నేతలు వర్గపోరును విడిచిపెట్టడం లేదు. ఆదోనిలో టీడీపీ పరాజయానికి.. […]
ఈ దఫా తెలంగాణలో అధికారంలోకి రావాలన్నది బీజేపీ ఆశ. దూరమైన అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. రాష్ట్రంలో బలంగా ఉన్న టీఆర్ఎస్ను మరింత బలంగా ఢీకొట్టేందుకు ఈ రెండు పార్టీలు వేయని ఎత్తుగడలు లేవు. ఈ క్రమంలో బీజేపీ రణతంత్రం ఒకలా ఉంటే.. కాంగ్రెస్ పొలిటికల్ వార్ ఇంకోలా ఉంది. కాకపోతే రెండు పార్టీల మధ్య ఒక విషయంలో సారూప్యత ఉండటంతో.. ఆ విషయం తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీ నాయకుల్లో టెన్షన్ పట్టుకుందట. వాటిపైనే […]
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం. వైసీపీలో వర్గ వివాదాలు.. విభేదాలు.. గ్రూప్ పాలిటిక్స్‌కు నగరి కేరాఫ్ అడ్రస్. ఇక్కడ పంచాయితీలు పలుమార్లు వైసీపీ అధిష్ఠానం వరకు వెళ్లాయి. అయినప్పటికీ రివెంజ్ పాలిటిక్స్ కొదవ లేదు. నగరి నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరసగా వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు ఆర్కే రోజా. సొంత పార్టీలోనే ఆమెకు అసమ్మతి సెగ ఉంది. గత ఎన్నికల సమయంలో ఈ సమస్య మరింత ముదిరి పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల నాటికి తారాస్థాయికి […]
నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్, వైసీపీ ఇంఛార్జ్, శాప్ ఛైర్మన్‌గా ఉన్న బైరెడ్డి సిద్దార్థరెడ్డి మధ్య తారాస్థాయిలో విభేదాలు ఉన్న సంగతి బహిరంగ రహస్యమే. ఎన్ని విభేదాలు ఉన్నా ఇద్దరూ పార్టీ కార్యక్రమాలతోపాటు.. ప్రభుత్వ ప్రొగ్రామ్స్‌లో చురుకుగా పాల్గొనేవారు. అయితే నాలుగు నెలలుగా సిద్దార్థరెడ్డి వైఖరిలో మార్పు వచ్చిందని వైసీపీ కేడర్ చెవులు కొరుక్కుంటోందట. ఎందుకలా అనే దానిపై పార్టీ నేతలు ఆరా తీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో సిద్దార్థరెడ్డి భేటీ […]
కేసీఆర్ ఆహ్వానంతో టీఆర్ఎస్లో చేరిక మండవ వెంకటేశ్వరరావు. మాజీ మంత్రి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవ.. నాటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేశారు. నాటి రాజకీయాల్లో మండవ పేరు ప్రముఖంగా వినిపించేది. జిల్లాలో బలమైన నేతగా ఉండేవారు కూడా. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి మారిపోయింది. అప్పటి వరకు టీడీపీలో ఉన్న ఆయన రాజకీయంగా సైలెంట్ అయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల ముందు అనూహ్యంగా టీఆర్ఎస్లో చేరారు మండవ. అప్పట్లో సీఎం కేసీఆర్ స్వయంగా మండవ […]
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు చాలామంది కేబినెట్ బెర్త్ ఆశించారు. చివరకు జిల్లాలు.. సామాజికవర్గాల వారీగా ఎమ్మెల్యేలను ఎంపిక చేసి ఛాన్స్ ఇచ్చారు సీఎం జగన్. ఈ క్రమంలో మంత్రివర్గంలో చోటు కోసం జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు చాలా పోటీపడ్డారు. సామాజిక సమీకరణాలను లెక్క చేయకుండా లాబీయింగ్ చేసిపడేశారు కూడా. చివరకు పోటీ పడినవ వారికి కాకుండా.. సైలెంట్‌గా ఉన్నవారికి అవకాశం దక్కింది. చాలా జిల్లాల్లో జరిగింది ఇదే. ఈ జాబితాలో ఉమ్మడి అనంతపురం జిల్లా […]