-
‘అమ్మ’గా అలరించిన శాంతకుమారి
(మే 17న మహానటి శాంతకుమారి జయంతి)‘అమ్మ’ పాత్రల్లో మేటిగా నటించి మెప్పించడమే కాదు, నిజజీవితంలోనూ ఎందరి చేతనో ‘అమ్మా’ అని పిలిపించుకున్న మహానటి పి.శాంతకుమారి. ప్రముఖ తెలుగు దర్శకులు పి.పుల్లయ్య సతీమణి శాంతకుమారి. పుల్లయ్యను ‘డాడీ’ అని, శాంతకుమారిని ‘మమ్మీ’ అంటూ పలువురు నటీనటులు, నిర్మాతలు, సాంకేతికనిపుణులు అభిమానంగా పిలిచేవారు. ఆ దంపతులు సైతం ఎంతోమందిని తమ కన్నబిడ్డల్లాగే చూసుకొనేవారు. చిత్రసీమలో ఆదర్శప్రాయమైన జంటల్లో పుల్లయ్య, శాంతకుమారి ముందు వరుసలో ఉంటారు. ఈ దంపతులిద్దరికీ తెలుగుచిత్రసీమలో ప్రతిష్ఠాత్మకమైన […] -
7 మిలియన్లకు చేరుకున్న సోనూసూద్ అనుచరగణం…!
రీల్ లైఫ్ విలన్, రియల్ లైఫ్ హీరో సోనూసూద్ పేదల పాలిట వరంగా మారాడు. ఎవరు, ఎక్కడ, ఎప్పుడు సహాయం కోరినా కాదనకుండా అందరినీ ఆదుకుంటూ దేవుడిలా మారాడు. కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌లో ఎంతోమంది పేదలకు సహాయం చేసి హీరోగా మారాడు. తన సొంత ఖర్చుతో వేలాది మంది వలస కార్మికులను వారి స్వగ్రామాలకు పంపినప్పుడు భారతదేశం మొత్తం సోనూసూద్ పై ప్రశంసల వర్షం కురిపించింది. తన ఔదార్యం, అవసరమైన వారికి సహాయం చేసే […] -
కరోనా బాధితులకు అండగా “మనం సైతం”
మానవ సేవే మాధవ సేవ అని బలంగా నమ్మిన కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో సాగుతున్న “మనం సైతం” కరోనా కష్ట కాలంలో ఎంతోమందిని ఆదుకుంది. ఆపదలో ఉన్న పేదలకు ఆర్థికసాయం అందించే సేవా యజ్ఞం కొనసాగిస్తూనే, నిత్యావసర వస్తువులు వంటివి అందించింది. తాజాగా చిత్రపురి కాలనీ ఐసోలేషన్ లో ఉన్న కోవిడ్ పేషెంట్స్ కు అండగా నిలబడేందుకు “మనం సైతం” కాదంబరి కిరణ్ ముందుకొచ్చారు. కోవిడ్ పేషెంట్లకు ఊచితంగా భోజన సదుపాయం, మందుల కిట్, పీపీఈ కిట్, […] -
ఆరుగురు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు కరోనా!
భారతదేశంలో వివిధ భాషల్లో సాగుతున్న బిగ్ బాస్ రియాలిటీ షోకు విశేష వీక్షకాదరణ ఉంది. హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల్లోనూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగుతోంది. హిందీలో సల్మాన్ ఖాన్, కన్నడలో సుదీప్, తమిళంలో కమల్ హాసన్ నిర్వహిస్తున్న ఈ రియాలిటీ షోను తెలుగులో మొన్న వరుసగా నాగార్జున రెండో సారి నిర్వహించారు. అలానే మలయాళంలో వరుసగా మూడోసారి మోహన్ లాల్ ఈ షోను నిర్వహించబోతున్నారు. ఇందు కోసం చెన్నయ్ శివార్లలోని ఈవీపీ గార్డెన్స్ లో […] -
ట్రెండింగ్ నెంబర్ 1లో ‘సినిమా బండి’
ట్రైలర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ‘సినిమా బండి’కి ఇప్పుడు మంచి స్పందన లభిస్తోంది. మే 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం ట్రెండింగ్ నెంబర్ 1లో ఉండడం విశేషం. ఈ వైవిధ్యమైన చిత్రంతో ప్రవీణ్ కంద్రెగుల దర్శకుడిగా పరిచయం కాగా… ఈ చిత్రం ఆటో రిక్షా డ్రైవర్ చుట్టూ తిరుగుతుంది. ఆటో డ్రైవర్ కు తన ఆటో వెనుక సీట్లో కెమెరా దొరుకుతుంది. ఆ కెమెరాతో తన స్నేహితుడితో కలిసి మంచి సినిమా చేయడానికి […] -
మోదీపై కమల్ కామరాజ్ నిరసన గళం!
ప్రముఖ నటుడు కమల్ కామరాజ్ పరోక్షంగా భారత ప్రధాని మోదీపై నిరసన గళం విప్పారు. తాజాగా తన ట్విట్టర్ అక్కౌంట్ లో ఓ పోస్టర్ ను పోస్ట్ చేశాడు కమల్ కామరాజ్. మా పిల్లల వాక్సిన్లను మీరు విదేశాలకు ఎందుకు పంపారు అంటూ హిందీలో ఉత్తర భారతీయులు కొందరు పోస్ట్ పెట్టినందువల్ల దాదాపు 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని చెబుతూ, ఈ హిందీ పోస్టర్ ను ఇతరులకు తెలియచేయడానికి తాను ఇంగ్లీష్ లో పెట్టానని తెలిపాడు. […] -
ఫ్యాన్స్ కు అండగా నవీన్ పోలిశెట్టి!
యంగ్ స్టార్ నవీన్ పోలిశెట్టి తన అభిమానులకు అండగా నిలుస్తున్నారు. తన మాటలతో వారికి ఓదార్పునిస్తున్నారు. కరోనా కారణంగా కుటుంబ సభ్యులను, సన్నిహితులను కోల్పోయిన అభిమానులతో వీడియో కాల్ లో మాట్లాడుతున్నారు. వారికి ధైర్యం చెబుతున్నారు. ఈ కష్టకాలంలో వారికి కావాల్సిన మానసిక స్థైర్యాన్ని అందిస్తున్నారు. ఇటీవల సాయి స్మరణ్ అనే నవీన్ పోలిశెట్టి అభిమాని తండ్రి కరోనాతో కన్నుమూశారు. సాయి స్మరణ్ తల్లి ఈ బాధతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఆమె మనసు వేరే పనుల […] -
కమల్ కు బాసటగా సనమ్ శెట్టి!
కమల్ హాసన్ సొంత పార్టీ మక్కల్ నీది మయ్యమ్ కు ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 2.52 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. గత యేడాది కమల్ హాసన్ తన పుట్టిన రోజు సందర్భంగా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని తానేనంటూ నర్మగర్భంగా సెలవిచ్చారు. ఇప్పుడు దానిని గుర్తు చేసి కొందరు ఆట పట్టిస్తుంటే, మరోపక్క కమల్ ను నమ్ముకుని పార్టీలోకి అడుగుపెట్టిన చాలామంది బ్యూరోక్రాట్స్ రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. ఐపీఎస్ అధికారి మౌర్యతో పాటు, […] -
‘ఏ కన్నులూ చూడనీ చిత్రమే’ సాంగ్ కు 3 మిలియన్ వ్యూస్
ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ తన అద్భుతమైన గొంతుతో అందరిని మాయ చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆయన పాడిన పాటలే వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన పాడిన ఏ కన్నులు చూడని సాంగ్ సరికొత్త రికార్డులు సృష్టించింది. కార్తీక్ రత్నం, కృష్ణప్రియ హీరోహీరోయిన్లుగా నవీన్ చంద్ర, సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘అర్థ శతాబ్దం’. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రేమ్స్ సెల్యులాయిడ్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో […] -
పైరసీ సైట్స్ కు సల్మాన్ హెచ్చరిక!
ఈద్ కానుకగా వచ్చిన సల్మాన్ ఖాన్ రాథే సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిందని ట్రేడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇదిలా ఉంటే… ఈ సినిమాను కొన్ని పైరేటెడ్ సైట్స్ పైరసీ చేయడంపై హీరో, నిర్మాత సల్మాన్ ఖాన్ మండిపడుతున్నాడు. జీప్లెక్స్ ద్వారా రీజనబుల్ గా రూ. 249 రూపాయలకే తమ చిత్రాన్ని చూసే ఏర్పాటు చేశామని, అయినా కొన్ని పైరేటెడ్ సైట్స్ తమ చిత్రాన్ని కాపీ చేసి సోషల్ మీడియాలో అందుబాటులో ఉంచడం దారుణమని సల్మాన్ […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!