రీల్ లైఫ్ విలన్, రియల్ లైఫ్ హీరో సోనూసూద్ పేదల పాలిట వరంగా మారాడు. ఎవరు, ఎక్కడ, ఎప్పుడు సహాయం కోరినా కాదనకుండా అందరినీ ఆదుకుంటూ దేవుడిలా మారాడు. కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌లో ఎంతోమంది పేదలకు సహాయం చేసి హీరోగా మారాడు. తన సొంత ఖర్చుతో వేలాది మంది వలస కార్మికులను వారి స్వగ్రామాలకు పంపినప్పుడు భారతదేశం మొత్తం సోనూసూద్ పై ప్రశంసల వర్షం కురిపించింది. తన ఔదార్యం, అవసరమైన వారికి సహాయం చేసే మంచి గుణంతో రియల్ హీరోకు, దేవుడిగా మారుగా నిలిచారు సోనూసూద్. ఆయన చేసిన సేవలకు ఎంతగా పొగిడినా తక్కువే. అయితే సోనూసూద్ ఇటీవలే తన అధికారిక ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌లో 7 మిలియన్ల మంది అనుచరగణాన్ని సొంతం చేసుకున్నారు. సహాయం కోరిన ప్రజల సమస్యలను పరిష్కరించడానికి సోను సూద్ ప్రధానంగా తన ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ రోజు వరకు అతను కరోనా సెకండ్ వేవ్ లో చాలా మంది ప్రాణాలను కాపాడాడు. దేశం మొత్తం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సూపర్ హీరో కన్నా వేగంగా పని చేస్తున్నారు సోనూసూద్.