కమల్ కు బాసటగా సనమ్ శెట్టి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కమల్ హాసన్ సొంత పార్టీ మక్కల్ నీది మయ్యమ్ కు ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 2.52 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. గత యేడాది కమల్ హాసన్ తన పుట్టిన రోజు సందర్భంగా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని తానేనంటూ నర్మగర్భంగా సెలవిచ్చారు. ఇప్పుడు దానిని గుర్తు చేసి కొందరు ఆట పట్టిస్తుంటే, మరోపక్క కమల్ ను నమ్ముకుని పార్టీలోకి అడుగుపెట్టిన చాలామంది బ్యూరోక్రాట్స్ రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. ఐపీఎస్ అధికారి మౌర్యతో పాటు, ఐఏఎస్ అధికారి సంతోష్ బాబు, పద్మప్రియ, సి.కె. కుమరవేలు, శేఖర్, సురేశ్ అయ్యర్ తదితరులు పార్టీని వీడి వెళ్ళిపోయారు. మరీ చిత్రం ఏమంటే పార్టీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మహేంద్రన్ రాజీనామా ఎవ్వరూ ఊహించనిది! కమల్ ను ఒంటరిని చేసి అంతా వెళ్లిపోతుంటే… కేవలం నటి, బిగ్ బాస్ ఫేమ్ సనమ్ శెట్టి మాత్రం ఆయనకు బాసటగా నిలిచి, వీరందరినీ కడిగిపారేస్తోంది. కమల్ హాసన్ పార్టీ ఒకవేళ ఎన్నికల్లో గెలిచి ఉంటే మీరు ఇలానే ప్రవర్తించేవారా? అని అడుగుతోంది. వ్యక్తిగత కారణం అనే ఒకే ఒక్క పదాన్ని ఉదహరించి పార్టీకి రాజీనామా చేసిన వారందరినీ మీకు అసలు కృతజ్ఞత అనేది ఉందా? అని ప్రశ్నిస్తోంది. పార్టీని, కమల్ హాసన్ ను మాత్రమే కాకుండా వీరంతా ఓటు వేసిన ప్రజలనూ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది సనమ్ శెట్టి. తమ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో ప్రచార సమయంలో చెప్పిన ఈ నేతలంతా… ఇవాళ తామెందుకు పార్టీకి రాజీనామా చేశారో కూడా చెప్పాల్సిన అవసరం ఉందని సనమ్ కోరుతోంది. కమల్ పార్టీకి సనమ్ శెట్టి గత ఎన్నికల్లో ప్రచారం చేయలేదు. కనీసం ఆ పార్టీలో కూడా చేరలేదు. కానీ ఇవాళ కమల్ హాసన్ కు మద్దత్తుగా అమ్మడు గళం విప్పడం వెనుక కనిపించని అదృశ్య శక్తులు ఏవో ఉండి ఉంటాయని కొందరు అనుమానిస్తున్నారు.
Also Read
- Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?
- Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
- BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
- Supreme Court: సీఈసీ నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. జడ్జిలు భిన్నాభిప్రాయాలు
- Tags
- Kamal Haasan
- Sanam Shetty
తాజావార్తలు
-
Mamata Banerjee: బెంగాల్‌లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..
-
Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. మళ్లీ దేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా రికార్డ్!
-
Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?
-
Ganesh Immersion 2026 : గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు.. 20 వేల మంది పోలీసులతో నిఘా.!
-
BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!