AP High Court: విజయ డెయిరీ బోర్డుకు హైకోర్టు షాక్.. చైర్మన్ సహా ఐదుగురి ఎన్నిక చెల్లదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: విజయ డెయిరీ బోర్డు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విజయ డెయిరీ చైర్మన్ దాసరి బాలవర్ధన్ రావు ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. చైర్మన్‌తో పాటు మరో నలుగురు బోర్డు డైరెక్టర్ల ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
కాగా, విజయ డైరీ చైర్మన్ దాసరి బాలవర్ధన్ రావు (గన్నవరం)తో పాటు సాయి (ఘంటసాల), పాలడుగు నాని (గన్నవరం), నాగేశ్వరరావు (నందిగామ), శైలజ (మైలవరం) డైరెక్టర్ల ఎన్నికను సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ఐదుగురు బోర్డు సభ్యులపై పోటీ చేసిన అభ్యర్థులను డిఫాల్టర్లుగా ప్రకటించడంతో వారి ఎన్నికల చెల్లుబాటుపై వివాదం తలెత్తింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన హైకోర్టు పోటీ చేసిన అభ్యర్థులు అనర్హులని ఆదేశాలు జారీ చేసింది.. మరోవైపు, విజయ డెయిరీ బోర్డు ఏర్పాటుకు మొత్తం 10 మంది సభ్యులు అవసరం కాగా, ప్రస్తుతం 8 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో బోర్డు వ్యవహారాలు, తదుపరి నిర్ణయాల కోసం అత్యవసర సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైకోర్టు తాజా ఆదేశాలతో విజయ డెయిరీ బోర్డులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read
- Cyclone Akwan Alert: దిశ మార్చుకోనున్న అక్వాన్!.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు..
- Cyclone Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్..!
- AP Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నేడే నోటిఫికేషన్.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Child Trafficking: బాలల అక్రమ రవాణాకు చెక్..! అదృశ్యమైన చిన్నారుల కోసం ఏపీ సర్కార్ కొత్త ప్లాన్..
తాజావార్తలు
-
AP High Court: విజయ డెయిరీ బోర్డుకు హైకోర్టు షాక్.. చైర్మన్ సహా ఐదుగురి ఎన్నిక చెల్లదు..!
-
Thailand Phuket Fire Accident: థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి, 17 మందికి గాయాలు!
-
King 100: కెరీర్లో ఇప్పటివరకు టచ్ చేయని ఫీట్.. ఈసారి ‘కింగ్’ కొట్టేస్తాడా?
-
TDP vs YSRCP: గుడివాడ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. మున్సిపల్ ఎన్నికల వేళ వైసీపీలో చేరిన టీడీపీ నేత
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
ట్రెండింగ్
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
-
Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!