ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ తన అద్భుతమైన గొంతుతో అందరిని మాయ చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆయన పాడిన పాటలే వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన పాడిన ఏ కన్నులు చూడని సాంగ్ సరికొత్త రికార్డులు సృష్టించింది. కార్తీక్ రత్నం, కృష్ణప్రియ హీరోహీరోయిన్లుగా నవీన్ చంద్ర, సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘అర్థ శతాబ్దం’. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రేమ్స్ సెల్యులాయిడ్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. చిట్టి కిరణ్, రామోజు, తేలు రాధాకృష్ణ ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘ఏ కన్నులూ చూడనీ చిత్రమే’ సాంగ్ కు తాజాగా రికార్డు స్థాయి వ్యూస్ వచ్చాయి. ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్ యూట్యూబ్ లో 3 మిలియన్ వ్యూస్ దాటేసింది. నౌ పాల్ రాజా సంగీతం అందించగా… సిద్ శ్రీరామ్ ఈ సాంగ్ ను ఆలపించారు. అద్భుతమైన లిరిక్స్ తో మనసుకు హత్తుకుంటున్న ‘ఏ కన్నులూ చూడనీ చిత్రమే’ లిరికల్ వీడియో సాంగ్ మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.