Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kapil Dev on Vaibhav Sooryavanshi: సెన్సేషనల్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీపై మాజీ కెప్టెన్, ప్రపంచకప్ విజేత కపిల్ దేవ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ క్రికెట్లో 15 ఏళ్ల వయసులోనే తనదైన ముద్ర వేస్తున్న వైభవ్ భవిష్యత్తులో సచిన్ టెండూల్కర్‌లా ఎదుగుతాడా..? లేక వినోద్ కాంబ్లీలా.. తన కెరీర్‌ను కొనసాగిస్తాడా.? అనేది ఇప్పుడే చెప్పడం కష్టమని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అతడిలో అపారమైన ప్రతిభ ఉందని, అయితే ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని కపిల్ అన్నారు.
తాజాగా ప్రముఖ మీడియాతో మాట్లాడిన కపిల్ దేవ్.. వైభవ్‌కు ప్రస్తుతం ఎక్కువగా ఆడే అవకాశాలు రావడం లేదని పేర్కొన్నారు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనింగ్ జోడీగా ఉండటంతో అతడికి అవకాశాలు పరిమితమవుతున్నాయని.. అయితే, అవకాశం వచ్చినప్పుడల్లా వైభవ్ తన సత్తా చాటుతున్నాడని కొనియాడారు. ప్రస్తుతం క్రికెట్ అభిమానులు ఫోర్లు, సిక్సర్లు చూడటానికి ఇష్టపడుతున్నారని.. కాబట్టి వైభవ్ తన దూకుడైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంటున్నాడని కపిల్ పేర్కొన్నారు. అయితే వైభవ్ కు మరింత సమయం ఇవ్వాలని, ప్రతిభ విషయంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు.
Also Read
- Araku Valley Weather: పడిపోయిన ఉష్ణోగ్రతలు!.. అరకు లోయలో మంచు అందాలు..
- Low Cost House Construction: రూ.5 లక్షలకే సొంత ఇల్లు.. ఇటుకలు, సిమెంట్ లేకుండానే నిర్మాణం..? అద్భుతమైన టెక్నాలజీ!
- India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
- Cyclone Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్..!
ప్రస్తుతం 15 ఏళ్ల వయసులో వైభవ్ దృష్టి పూర్తిగా క్రికెట్‌పైనే ఉంటుందని చేబుతూనే.. 18-19 ఏళ్ల వయసుకు వచ్చేసరికి పార్టీలతో పాటు ఇతర ఆకర్షణలు, దృష్టి మళ్లించే అంశాలు ఎదురవుతాయని, ఆ సమయంలో వాటికి దూరంగా ఉంటూ ఆటపైనే దృష్టి పెట్టడం కీలకమని స్వీట్ వార్నింగ్ ఇవ్వకనే ఇచ్చారు. అంతేకాకుండా వైభవ్ ఫ్యూచర్ లో “సచిన్ టెండూల్కర్‌లా గొప్ప క్రికెటర్ అవుతాడా..? లేక వినోద్ కాంబ్లీలా కెరీర్ కొనసాగిస్తాడా.?” అనేది ఈ దశలో చెప్పలేమని కపిల్ పేర్కొన్నారు. క్రికెట్‌పైనే పూర్తి ఏకాగ్రత పెట్టాలని, ప్రారంభ విజయాలతో వచ్చే డబ్బు, పేరు ప్రఖ్యాతులకు ఆకర్షితుడు కాకూడదని సూచించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
Araku Valley Weather: పడిపోయిన ఉష్ణోగ్రతలు!.. అరకు లోయలో మంచు అందాలు..
-
Asus ExpertBook A7: ఆసుస్ ఎక్స్‌పర్ట్‌బుక్ A7 లాంచ్.. 8GB RAM, OLED డిస్ప్లే, 24 గంటల బ్యాటరీ!
-
Kaaka Update: ‘కాకా’లో స్పెషల్ సాంగ్.. రితికాతో ‘మెగాస్టార్’ మాస్ స్టెప్పులు!
-
Low Cost House Construction: రూ.5 లక్షలకే సొంత ఇల్లు.. ఇటుకలు, సిమెంట్ లేకుండానే నిర్మాణం..? అద్భుతమైన టెక్నాలజీ!
ట్రెండింగ్
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
-
Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!
-
Jio యూజర్లకు బిగ్ షాక్.. ఇకపై ఆ వినియోగదారులకు సేవలు బంద్..? అలర్ట్ మెసేజ్‌లు షురూ..!
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు