Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India U19 Star Mohit Ulva: అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత యువ జట్టు అద్భుత విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో టీమిండియా ఒక వికెట్ తేడాతో గెలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచిన యువ ఆటగాడు మోహిత్ ఉల్వా.. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అజేయంగా 49 పరుగులు చేసిన అతడు.. అసాధ్యమనుకున్న విజయాన్ని భారత్‌కు అందించాడు. ఈ అద్భుత ప్రదర్శనకు ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు కూడా దక్కింది.
మ్యాచ్‌ను మలుపు తిప్పాడు:
మస్కట్ వేదికగా జరిగిన ఫైనల్లో భారత్ 252 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో జట్టు విజయానికి మరో 84 పరుగులు అవసరమయ్యాయి. అలాంటి ఒత్తిడి పరిస్థితుల్లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన 18 ఏళ్ల మోహిత్ ఉల్వా ఏమాత్రం తడబడలేదు. కేవలం 26 బంతుల్లోనే అజేయంగా 49 పరుగులు చేసి భారత విజయానికి బాటలు వేశాడు. తొలుత మనల్ చౌహాన్‌తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 57 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత చివరి వికెట్‌కు సి. వెంకటతో కలిసి మరో 29 పరుగులు జోడించాడు. చివరి బంతికి మూడు పరుగులు అవసరమైన సమయంలోనూ ఒత్తిడిని అధిగమించి.. భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పిన మోహిత్ ఎవరు అని క్రికెట్ అభిమానులు గూగుల్ చేస్తున్నారు.
Also Read
- Jay Shah Journey: 2009లో మెదలైన ప్రయాణం.. జై షా ప్రస్థానంలో కీలక మైలురాళ్లు.. బీసీసీఐ నుంచి ఐసీసీ వరకు!
- ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
- Rohit-Kohli: అభిమానుల కోసమే ఆడుతున్నారు.. రో-కోలను తక్కువగా చూడటం సరికాదు!
- Gautam Gambhir: గౌతమ్ గంభీర్ చెప్పింది నిజమే.. టీమిండియా బ్యాటింగ్‌పై ఆందోళన!
జడేజాను తీర్చిదిద్దిన కోచ్ దగ్గరే శిక్షణ:
మోహిత్ ఉల్వా గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందిన యువ క్రికెటర్. అతడు క్రికెట్ బంగ్లా అకాడమీలో మహేంద్రసిన్హ్ చౌహాన్ దగ్గర శిక్షణ పొందాడు. భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను కూడా తీర్చిదిద్దిన కోచ్‌గా మహేంద్రసిన్హ్ చౌహాన్‌కు పేరుంది. అదే కోచ్ వద్ద శిక్షణ పొందిన మోహిత్ ఇప్పుడు అండర్-19 స్థాయిలో తన ప్రతిభను చాటుకోవడం విశేషం. చిన్నతనంలోనే మోహిత్‌కు క్రికెట్‌పై ఆసక్తి ఏర్పడటానికి అతడి తండ్రి కారణమయ్యారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో పనిచేసే ఆయన ప్రోత్సాహంతో మోహిత్ క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. కుటుంబ ప్రోత్సాహం, కోచ్ మార్గదర్శకత్వంతో క్రమంగా ఎదుగుతూ భారత అండర్-19 జట్టులో చోటు సంపాదించాడు.
బ్యాటింగ్‌లోనే కాదు బౌలింగ్‌లోనూ సత్తా:
మోహిత్ ఉల్వా కేవలం బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ జట్టుకు ఉపయోగపడుతున్నాడు. భారత అండర్-19 జట్టుకు ఇన్నింగ్స్ ఆరంభంలో బౌలింగ్ చేసే బాధ్యతను కూడా నిర్వర్తిస్తున్నాడు. ఈ ఆసియా కప్ టోర్నీలో మూడు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల యూత్ వన్డే సిరీస్‌లోనూ ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. పాకిస్థాన్‌తో ఫైనల్లో ఒత్తిడిని తట్టుకుని ఆడిన ఇన్నింగ్స్‌తో మోహిత్ పేరు ఒక్కసారిగా మార్మోగుతోంది. కీలక సమయంలో జట్టును ఆదుకోవడమే కాకుండా..భారత క్రికెట్‌కు మరో ప్రతిభావంతమైన యువ ఆటగాడు దొరికాడనే నమ్మకాన్ని కలిగించాడు. భవిష్యత్తులో సీనియర్ జట్టులోనూ చోటు సంపాదిస్తాడా అన్నది చూడాలి.
- Tags
- ind vs nz
- India U19
- Mohit Ulva
తాజావార్తలు
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
Apple Health AI App: ChatGPTకి పోటీగా Apple కొత్త AI హెల్త్ యాప్.. వైద్య పరిశోధనలతో ఆరోగ్య సమస్యలకు సమాధానాలు!
-
Vizag Crime: ఇన్‌స్టా పరిచయంతో ఇంట్లోకి ఎంట్రీ.. బంగారం, వజ్రాల నగలతో పరారీ..!
-
Varanasi Update: ఆ ఎద్దు మీద మహేష్‌ను చూసి ఏడాది అయింది.. మరో అప్డేట్ అయినా ఇవ్వండి సార్..!
-
AP Panchayat Elections Phase 2: రెండో దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్.. నామినేషన్ల నుంచి ఫలితాల వరకు పూర్తి వివరాలివే!
ట్రెండింగ్
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
-
Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!