ఈద్ కానుకగా వచ్చిన సల్మాన్ ఖాన్ రాథే
సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిందని ట్రేడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇదిలా ఉంటే… ఈ సినిమాను కొన్ని పైరేటెడ్ సైట్స్ పైరసీ చేయడంపై హీరో, నిర్మాత సల్మాన్ ఖాన్ మండిపడుతున్నాడు. జీప్లెక్స్ ద్వారా రీజనబుల్ గా రూ. 249 రూపాయలకే తమ చిత్రాన్ని చూసే ఏర్పాటు చేశామని, అయినా కొన్ని పైరేటెడ్ సైట్స్ తమ చిత్రాన్ని కాపీ చేసి సోషల్ మీడియాలో అందుబాటులో ఉంచడం దారుణమని సల్మాన్ ఖాన్ వాపోతున్నాడు. ఇలాంటి వారిని ఎవరూ ప్రోత్సహించవద్దని చెబుతూనే, ఈ రకంగా పైరసీ చేసే వారు సైబర్ సెల్ తీసుకునే చర్యలతో ఇబ్బందుల పాలవుతారని హెచ్చరించాడు. ఇదిలా ఉంటే… ఈ సినిమాను కూడా పైరసీ చేస్తారా?
అని కొందరు ప్రశ్నిస్తుంటే, ఇలాంటి మూవీస్ ను డబ్బులు పెట్టి చూడటం కంటే… ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకుని పైరేటెడ్ వర్షన్ చూడటమే బెటర్ అని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా ఈ ఈద్ మాత్రం సల్లూబాయ్ కు బ్యాడ్ ఎక్స్ పీరియన్సే ఇచ్చింది.