Tiger Nageswara Rao Movie Opening Ceremony ఉగాది పర్వదినం సందర్భంగా గ్రాండ్ గా జరుగుతోంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సినిమాకు ఫస్ట్ క్లాప్ కొట్టిన మెగాస్టార్, ఆ తరువాత Tiger Nageswara Rao ప్రీ లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ Tiger Nageswara Rao తాను చేయాల్సిన సినిమా అని చెప్పి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తనకు ముందుగా డైరెక్టర్ Tiger […]
ఉగాది సందర్భంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. “యానిమల్” వరల్డ్ లోకి రష్మిక మందన్నను ఆహ్వానిస్తూ తాజాగా ట్వీట్ చేశారు. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ అంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అదే విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు ‘యానిమల్’ మేకర్స్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రైమ్ డ్రామాలో రణబీర్ కపూర్, అనిల్ కపూర్, […]
Bimbisara రాకకు ముహూర్తం ఖరారయ్యింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం “బింబిసార”. నూతన దర్శకుడు మల్లిడి వశిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ కె అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఉగాది సందర్భంగా సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు మేకర్స్. ఆగస్ట్ 5న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు కొత్త పోస్టర్ ద్వారా సినిమా విడుదల […]
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ యాడ్ చేస్తున్నాడంటూ గత కొన్ని రోజులుగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. శుభగృహ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా మెగాస్టార్ చిరంజీవి ఈ యాడ్ చేస్తున్నట్టు వారే స్వయంగా వెల్లడించారు కూడా. అన్ని ప్రముఖ టీవీ ఛానెల్స్‌తో పాటు సోషల్ మీడియాలో ప్రసారం కానుంది. తాజాగా బయటకు వచ్చిన ఈ యాడ్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. […]
Vikrant Rona రిలీజ్ డేట్ టీజర్ ను తాజాగా మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. “ఇది అద్భుతంగా ఉంది ! కిచ్చ సుదీప్ అడ్వెంచర్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ టీజర్ ను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందంటూ చిరు సోషల్ మీడియాలో “విక్రాంత్ రోనా” టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక సరికొత్త జోనర్ లో సినిమాను తెరకెక్కించిన దర్శకుడు బండారితో పాటు చిత్రబృందానికి విషెస్ అందించారు. హిందీలో ‘విక్రాంత్ రోనా’ విడుదల తేదీ టీజర్‌ను […]
(ఏప్రిల్ 2తో ‘బంగారు కానుక’కు 40 ఏళ్ళు) నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి జంటగా నటించిన చిత్రాలలో ఎవర్ గ్రీన్ అంటే ‘ప్రేమాభిషేకం’ చిత్రమే! ఆ సినిమా ఘనవిజయం సాధించిన తరువాత ఏయన్నార్, శ్రీదేవి కాంబోలో మరికొన్ని చిత్రాలు వెలుగు చూశాయి. అయితే అవేవీ ‘ప్రేమాభిషేకం’ స్థాయిలో అలరించలేక పోయాయి. ‘ప్రేమాభిషేకం’ తరువాత ఏయన్నార్, శ్రీదేవి నటించిన చిత్రాలు వచ్చాయి. కానీ, వాటిలో వారిద్దరూ జంటగా నటించిన చిత్రం ‘ప్రేమకానుక’. ఆ సినిమా తరువాత వచ్చిన చిత్రం […]
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం… ఈరోజు తెలుగు వారికి మరో కొత్త సంవత్సరం ప్రారంభం. తెలుగు వారు సాంప్రదాయకంగా భావించే ఉగాది పండగను దక్షిణ భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలలో కొత్త సంవత్సరం ప్రారంభానికి గుర్తుగా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఉగాది పండుగ చైత్ర మాసం మొదటి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఉగాది ఏప్రిల్ 2, శనివారం వచ్చింది. ఈ పండగ సందర్భంగా ప్రజలు సంప్రదాయబద్ధంగా తమ ఇంటిని […]
డైరెక్టర్ ఎన్ లింగుసామి దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన “ది వారియర్” సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. యాక్షన్‌తో కూడిన ఎనర్జిటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, అక్షర గౌడ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. తాజాగా మేకర్స్ ఉగాది సందర్భంగా ప్రేక్షకులకు విషెస్ చెబుతూ ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. […]
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తాజాగా తన అభిమానులను అద్భుతమైన ఫోటోషూట్‌లతో ట్రీట్ చేస్తోంది. తాజా పిక్స్ ఆమె అభిమానులను నిద్ర లేకుండా చేస్తున్నాయి. గ్రాజియాఇండియా మిలీనియల్ అవార్డుల వేడుకలో జాన్వీకపూర్ మెరిసిపోయే సిల్వర్ కలర్ డ్రెస్ లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అందాలను దాచుకోవడానికి ఏమాత్రం ఇష్టపడని జాన్వీ ఈ పిక్స్ లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్లను తలదన్నే అందంతో మెరిసిపోతోంది. రోజురోజుకూ జాన్వీ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో ఓ సినిమా చేయనున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాత్కాలికంగా #SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. ఇప్పటికే జక్కన్న ఈ మెగా ప్రాజెక్ట్ బాహుబలి, ఆర్ఆర్ఆర్ లను మించి ఉంటుందని వెల్లడించి సినిమాపై హైప్ ని ఆకాశాన్ని తాకేలా చేశారు. ఇక తాజాగా జక్కన్న సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ను వెల్లడించారు. “ఆర్ఆర్ఆర్”తో మరో […]