Tiger Nageswara Rao Movie Opening Ceremony ఉగాది పర్వదినం సందర్భంగా గ్రాండ్ గా జరుగుతోంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సినిమాకు ఫస్ట్ క్లాప్ కొట్టిన మెగాస్టార్, ఆ తరువాత Tiger Nageswara Rao ప్రీ లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ Tiger Nageswara Rao తాను చేయాల్సిన సినిమా అని చెప్పి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తనకు ముందుగా డైరెక్టర్ Tiger Nageswara Rao స్టోరీ చెప్పినప్పుడు ఒక దొంగను హీరోగా చూడడం ఏంటి ? అనుకున్నారట. ఆ తరువాత స్టోరీ రాబిన్ హుడ్ రేంజ్ లో అన్పించిందని అన్నారు. అయితే అదే స్టోరీ రవితేజ దగ్గరకు వెళ్లడం మంచిదేనని, ఆ పాత్ర రవితేజకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని అన్నారు. అంటే తన ఉద్దేశం రవితేజ దొంగ అని కాదని చమత్కరించారు. అయితే చిరు ఈ సినిమాను రిజెక్ట్ చేయడానికి గల కారణం ఏంటన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
Read Also : Rashmika Mandanna : క్రేజీ ఆఫర్… ‘యానిమల్’ వరల్డ్ లో నేషనల్ క్రష్
రవితేజ మొదటి పాన్-ఇండియా చిత్రం “టైగర్ నాగేశ్వరరావు”. వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రైమ్ డ్రామాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ మోడల్ గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌గా ఎంపికైంది. ఆమెతో పాటు బాలీవుడ్ దివా కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ కూడా మరో కథానాయికగా నటిస్తోంది. జి.వి.ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.