ఉగాది సందర్భంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. “యానిమల్” వరల్డ్ లోకి రష్మిక మందన్నను ఆహ్వానిస్తూ తాజాగా ట్వీట్ చేశారు. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ అంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అదే విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు ‘యానిమల్’ మేకర్స్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రైమ్ డ్రామాలో రణబీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇంతకు ముందు ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రాను హీరోయిన్ గా ప్రకటించారు. కానీ పరిణీతి ‘యానిమల్’ నుండి తప్పుకుంది. ఇప్పుడు రష్మిక మందన్నను ఈ సినిమాలో కొత్త కథానాయికగా ఎంచుకున్నారు చిత్ర నిర్మాతలు.
Read Also : Bimbisara : రాకకు ముహూర్తం ఫిక్స్
ఇక హీరోయిన్ విషయమే కాకుండా సినిమా విడుదల తేదీని కూడా ఉగాది పర్వదినం సందర్భంగా వెల్లడించారు. 2023 ఆగస్ట్ 11న మూవీని విడుదల చేయనున్నారు. దీంతో “యానిమల్” షూటింగ్ ను ఈ వేసవిలోనే ప్రారంభించే అవకాశం ఉంది. “యానిమల్”ని భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్‌ల T-సిరీస్, మురాద్ ఖేతానీ సినీ1 స్టూడియోస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
❤️ let’s do thisssss @imvangasandeep ! 💣🔥 https://t.co/Q3n8pc4lxC
— Rashmika Mandanna (@iamRashmika) April 2, 2022