Credit Cards: మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నాయా… అయితే సిబిల్ స్కోర్ ఢమాల్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా మంది క్రెడిట్ కార్డులు వాడుతుంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడేవారు చాలా మంది ఉన్నారు. అయితే ఇలాంటి వారి సిబిల్ స్కోర్ ఎలా ఉంటుంది? వారి స్కోర్ తగ్గుతుందా? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారు? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
‘నీ దగ్గర ఎన్ని క్రెడిట్ కార్డులు ఉన్నాయి’ అని కొందరు అడుగుతుంటారు. కానీ నిజానికి అది తప్పు. మనం అడగాల్సింది.. నువ్వు నీ క్రెడిట్ లిమిట్‌లో ఎంత వాడుతున్నావ్’ అని. బ్యాంకులు లేదా అప్పు ఇచ్చే సంస్థలు మీ దగ్గర ఎన్ని కార్డులు ఉన్నాయనే దానికంటే, మీరు ఆ కార్డులను ఎలా వాడుతున్నారనే దానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాయి. దీనినే ‘క్రెడిట్ యుటిలైజేషన్’ అంటారు.
Also Read
- No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
- Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
- LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
క్రెడిట్ కార్డులు ఎక్కువ ఉంటే సిబిల్ స్కోర్ తగ్గుతుందా?
చాలా మంది కూడా దీనిపై అపోహ పడుతుంటారు. క్రెడిట్ కార్డులు ఎక్కువగా ఉండటం వల్ల సిబిల్ స్కోర్ తగ్గదని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు.. ఎక్కువ కార్డులు ఉండటం వల్ల మీ మొత్తం క్రెడిట్ లిమిట్ పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు.. ఒకే కార్డుపై రూ. 1 లక్ష లిమిట్ ఉండి మీరు రూ. 50,000 ఖర్చు చేస్తే, మీరు 50% లిమిట్ వాడినట్లు అవుతుంది. అదే మీ దగ్గర మూడు కార్డులు ఉండి మొత్తం లిమిట్ రూ. 3 లక్షలు అయితే, అదే రూ. 50,000 ఖర్చు కేవలం 16 శాతం మాత్రమే అవుతుంది. ఇలా లిమిట్ కంటే తక్కువ వాడటం వల్ల మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది.
అయితే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్లు వాడకూడదు. మీ మొత్తం లిమిట్‌లో 30 శాతం కంటే తక్కువ మాత్రమే వాడాలి. అంతకంటే ఎక్కువ వాడితే, మీరు పూర్తిగా అప్పుల మీద ఆధారపడి బతుకుతున్నారని బ్యాంకులు భావిస్తాయి. దీని వల్ల సిబిల్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది. మీ క్రెడిట్ స్కోర్ పెరగాలంటే.. వాడకం 10% లోపు ఉంటే ఇంకా మంచిది.
ఎక్కువ కార్డులతో వచ్చే ఇబ్బందులు
కార్డులు పెరిగేకొద్దీ బాధ్యత కూడా పెరుగుతుంది. ప్రతి కార్డుకు వేర్వేరు తేదీలు ఉంటాయి. ఒక్క రోజు ఆలస్యమైనా పెనాల్టీ పడుతుంది. కార్డులు ఎక్కువగా ఉంటే అనవసరమైన వస్తువులు కొనాలనే కోరిక కలుగుతుంది. అందుకే కనీసం 2 లేదా 3 కార్డులు ఉంటే సరిపోతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.
Also Read:Palli Chattambi Telugu Review: పళ్లి చట్టంబి తెలుగు రివ్యూ
క్రెడిట్ కార్డుపై వడ్డీ రేట్లు ఏడాదికి 36 శాతం నుంచి 48 శాతం వరకు ఉంటాయి. మీరు కేవలం ‘మినిమం అమౌంట్’ మాత్రమే కడితే.. మిగిలిన డబ్బుపై భారీ వడ్డీ పడుతుంది. అంతేకాదు.. ఆ తర్వాత మీరు చేసే ప్రతి కొత్త ఖర్చుపై మొదటి రోజు నుంచే వడ్డీ వసూలు చేస్తారు. అందుకే ఎప్పుడూ పూర్తి బిల్లును గడువులోపు కట్టేయాలి. వీలైతే ‘ఆటో పే’ ఆప్షన్ పెట్టుకోవడం ఉత్తమం.
క్రెడిట్ కార్డులు అనేవి తెలివిగా వాడితే మంచి ఆయుధాలు. అవి మీకు రివార్డులు ఇస్తాయి, అత్యవసర సమయంలో ఆదుకుంటాయి. కానీ వాటిని మీ సొంత ఆదాయంలా భావించి విచ్చలవిడిగా ఖర్చు చేస్తే మాత్రం అప్పుల ఊబిలో మునిగిపోక తప్పదు. క్రమశిక్షణతో వాడటమే క్రెడిట్ కార్డుల అసలు రహస్యం.
తాజావార్తలు
-
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!