సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో ఓ సినిమా చేయనున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాత్కాలికంగా #SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. ఇప్పటికే జక్కన్న ఈ మెగా ప్రాజెక్ట్ బాహుబలి, ఆర్ఆర్ఆర్ లను మించి ఉంటుందని వెల్లడించి సినిమాపై హైప్ ని ఆకాశాన్ని తాకేలా చేశారు. ఇక తాజాగా జక్కన్న సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ను వెల్లడించారు. “ఆర్ఆర్ఆర్”తో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న జక్కన్న ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే మహేష్ మూవీపై దృష్టి పెట్టబోతున్నారట. చాలా ప్రీ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని పూర్తి చేసి మరో 6 నెలల్లో సినిమాను ప్రారంభించనున్నట్టు రాజమౌళి వెల్లడించారు.
Read Also : Sarkaru Vaari paata : కీలక అప్డేట్ ఇచ్చిన తమన్
మరి రాజమౌళి 6 నెలలు అన్నారంటే దానిపై సంవత్సరం వర్క్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఇదంతా చూస్తుంటే మహేష్ , రాజమౌళి మూవీ 2023లోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్నాడు. తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో #SSMB28ని చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక SSMB29 స్టార్ట్ అవుతుంది.