4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xiaomi TV S Mini LED Series 2026 Launch: షియోమీ (Xiaomi) నుండి కొత్త స్మార్ట్ టీవీ సిరీస్ Xiaomi TV S Mini LED Series 2026ను అధికారికంగా లాంచ్ చేసింది. గ్లోబల్ మార్కెట్‌లో ఇప్పటికే లాంచ్ అయినా ఈ సిరీస్ ఇప్పుడు భారత్ లోకూడా అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్ లో 55, 65, 75 అంగుళాల మూడు సైజుల్లో ఈ టీవీలు ఉన్నాయి. QD Mini-LED టెక్నాలజీతో రూపొందించిన ఈ టీవీలు ప్రీమియం విజువల్ అనుభవాన్ని అందిస్తాయి.
Varun Tej: వరుణ్ తేజ్ మోకాలికి సర్జరీ.. నిహారిక కీలక ప్రకటన.!
Also Read
- WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
- Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
ఈ సిరీస్‌లోని 75 అంగుళాల మోడల్ టీవీలో 512 లోకల్ డిమ్మింగ్ జోన్లు ఉండటం ప్రత్యేకత. దీని ద్వారా బ్యాక్ లైట్ కంట్రోల్ మెరుగుపడి.. మరింత కాంట్రాస్ట్, క్లారిటీ లభిస్తుంది. అన్ని మోడళ్లలో గరిష్టంగా 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందించబడుతోంది. డిస్‌ప్లే విషయానికి వస్తే 4K UHD (3840×2160) రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 178 డిగ్రీల వీయింగ్ యాంగిల్‌తో ఈ టీవీలు అద్భుతమైన విజువల్ క్వాలిటీని అందించనున్నాయి. HDR10+, డాల్బీ విజన్, HLG, ఫిలిం మేకర్ మోడ్ వంటి ఫీచర్లతో సినిమా అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా MEMC, AI గేమ్ బూస్ట్ వంటి ఫీచర్లు గేమింగ్, ఫాస్ట్ మూవింగ్ కంటెంట్‌ను స్మూత్‌గా చూపిస్తాయి.
ఈ టీవీలలో ఆడియో పరంగా చూస్తే.. 34W సౌండ్ అవుట్‌పుట్‌తో 4 స్పీకర్ యూనిట్లు (2 ట్వీటర్లు + 2 ఫుల్ రేంజ్ స్పీకర్లు) అందించబడ్డాయి. డాల్బీ ఆడియో, DTS:X, DTS Virtual:X సపోర్ట్ తో సౌండ్ అనుభవం థియేటర్ స్థాయిలో ఉంటుంది. ఈ టీవీలు ‘గూగుల్ టీవీ’ ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తాయి. Quad-core Cortex A55 ప్రాసెసర్, Mali-G52 GPU, 2GB RAM, 32GB స్టోరేజ్‌తో స్మూత్ పనితీరును అందిస్తాయి. కనెక్టివిటీ పరంగా Wi-Fi 6, బ్లూటూత్ 5.2, HDMI 2.1, USB పోర్టులు, ఈథర్నెట్ వంటి అన్ని ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.
Peddi: జూన్’కి ‘పెద్ది’ వాయిదా.. టీం అధికారిక ప్రకటన.!
ధరల విషయానికి వస్తే.. 55 అంగుళాల మోడల్ ధర రూ. 51,999గా, 65 అంగుళాల మోడల్ రూ. 71,999గా, 75 అంగుళాల మోడల్ రూ. 99,999గా నిర్ణయించారు. ఈ టీవీలు అమెజాన్, mi.com, షియోమీ రిటైల్ స్టోర్లలో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉన్నాయి. ప్రి-బుకింగ్ ఆఫర్లలో భాగంగా HDFC, ICICI క్రెడిట్ కార్డులతో రూ. 3,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రూ. 6,499 విలువైన 4 సంవత్సరాల కంప్రెహెన్సివ్ వారంటీ ఉచితంగా అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!