డైరెక్టర్ ఎన్ లింగుసామి దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన “ది వారియర్” సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. యాక్షన్‌తో కూడిన ఎనర్జిటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, అక్షర గౌడ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. తాజాగా మేకర్స్ ఉగాది సందర్భంగా ప్రేక్షకులకు విషెస్ చెబుతూ ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. అందులో రామ్ స్టైలిష్ లుక్ లో సూపర్ కాప్ గా కన్పిస్తున్నారు. పోలీస్ యూనిఫామ్ లో పవర్ ఫుల్ గా కన్పిస్తున్నారు.
Read Also : Janhvi Kapoor Pics : అందాలతో మత్తెక్కిస్తున్న రాక్షసి
‘వారియర్’గా రామ్ ఈ వర్షాకాలంలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఈ తెలుగు, తమిళ సినిమాని జూలై 14న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక “ఇస్మార్ట్ శంకర్”తో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ వారియర్ మళ్ళీ ఆ రేంజ్ హిట్ కోసం ట్రై చేస్తున్నాడు. కాగా రామ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో రూపొందనున్న విషయం తెలిసిందే.