PM Modi: దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదు, నాది హామీ..
- డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగదు..
- పార్లమెంట్ వేదికగా ప్రధాని నరేంద్రమోడీ హామీ..
- మహిళా బిల్లు క్రెడిట్ విపక్షాలే తీసుకోండి..
- అడ్డుకుంటే మాత్రం నాకే రాజకీయ లాభం చేకూరుతుంది..
- లోక్‌సభలో ప్రధాని మోడీ ఫైరీ స్పీచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: డీలిమినేషన్ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభలో హామీ ఇచ్చారు. గురువారం ఆయన మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై మాట్లాడారు. చిన్న రాష్ట్రం, పెద్ద రాష్ట్రం అనే తేడాలు మాకు లేవని ప్రధాని అన్నారు. మహిళా బిల్లు ద్వారా మాకు క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదని, మీరే క్రెడిట్ తీసుకోవాలని విపక్షాలకు సూచించారు. కావాలంటే ప్రభుత్వ ఖర్చుతో మీ ఫోటోలు వేయించి ప్రచారం చేయిస్తానని చెప్పారు. అందరి కలిసి కట్టుగా నిర్ణయం తీసుకుంటే ఎవరికి మైలేజ్ అనే ప్రస్తావనే ఉండదని అన్నారు.
Read Also: PM Modi: ఇది చరిత్ర సృష్టించే సమయం.. మహిళా రిజర్వేషన్లకు ప్రధాని మద్దతు..
Also Read
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
బిల్లు విషయంలో తనకు లాభం చేకూరుతుందని కొందరు భావిస్తున్నారని, మీరు వ్యతిరేకిస్తే సహజంగా నాకు రాజకీయ లాభం చేకూరుతుందని, దీనికి మద్దతు ఇస్తే ఈ ఘటన అందరికి ఘనత దక్కుతుందని అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ప్రకటనలో ప్రతీ ఒక్కరి ఫోటోలు వేయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కావాలంటే ఈ క్రెడిట్ మీరే తీసుకునే పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు విపక్షాలకు చురకలు అంటించారు. మరోవైపు డీలిమిటేషన్ వల్ల ఒక్క రాష్ట్రానికి కూడా అన్యాయం జరుగదని ప్రధాని స్పష్టం చేశారు. కొందరు ఈ బిల్లు ద్వారా ఉత్తరాది, దక్షిణాది విబజన తీసుకురావాలని చూస్తున్నారని, దేశమంతా ఒక్కటే అని దీంట్లో విభజన తీసుకురావద్దని విపక్షాలకు హితవు పలికారు. ఈ బిల్లు వెనక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని మరోసారి చెప్పారు.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
-
Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..