Santhosh Sobhan ఇంట్రెస్టింగ్ కమర్షియల్ సినిమాలు చేస్తూ ఆడియెన్స్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యువ కథానాయకుడు సంతోష్ శోభన్. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ‘గోల్కొండ హైస్కూల్’ చిత్రంతో తెరంగేట్రం చేసిన సంతోష్, ‘తను నేను’ చిత్రంతో కథానాయకుడిగా అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే ప్రతిభ గల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. పక్కింటి కుర్రాడిలా కనిపించడం సంతోష్ శోభన్ కున్న అడ్వాంటేజ్. ‘పేపర్ బాయ్’ మూవీతో క్రిటికల్ అక్లైమ్ తెచ్చుకుని, ”ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి” సినిమాలతో గుర్తింపును పొందాడు. మారుతి లాంటి పేరున్న దర్శకులతో పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెబుతుంటారు సంతోష్ శోభన్.
సినిమాల్లో బిజీగా ఉంటూనే ఓటీటీ లో ప్రాజెక్ట్స్ చేస్తూ సంతోశ్ శోభన్ మరో సెక్షన్ ఆడియెన్స్ నూ మెప్పిస్తున్నాడు. అతను నటించిన ‘ద గ్రిల్’, ‘ద బేకర్ అండ్ ద బ్యూటీ’ వెబ్ మూవీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ‘శ్రీదేవి శోభన్ బాబు’, ‘ప్రేమ్ కుమార్’ అనే సినిమాలతో పాటు యూవీ క్రియేషన్స్ లో రెండు ప్రాజెక్ట్స్ లకు ప్లానింగ్ జరుగుతోంది. ఒక సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయి రిలీజ్ కు రెడీ గా ఉండగా, మరో సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే స్వప్న సినిమా పతాకంపై ప్రియాంక దత్ నిర్మాణంలో నందినీరెడ్డి దర్శకత్వంలో ‘అన్ని మంచి శకునములే’ అనే సినిమాలో సంతోష్ శోభన్ నటిస్తున్నాడు. అతని తాజా చిత్రం ‘లైక్ షేర్ సబ్ స్క్రైబ్’ నవంబర్ 4న విడుదల కాబోతోంది. లైనప్ లో ఉన్న సంతోశ్ శోభన్ మూవీస్ అతన్ని మంచి ఫామ్ లోకి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.