AHA: ‘కామెడీ స్టాక్ ఎక్సేంజ్’తో ఓటీటీలోకి స్టార్ డైరెక్టర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Ravipudi ”అరే.. స్టాక్స్ దుమ్ములేపడానికి రెడీగా ఉండండి. బొమ్మ దద్దరిపోతుంది” అని అంటున్నారు ప్రముఖ దర్శకులు అనిల్ రావిపూడి. ఈ కామెడీ సినిమాల స్టార్ డైరెక్టర్ ఆహా తెలుగు ద్వారా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఎవరికైనా నలుగురి ముఖాల్లోనూ నవ్వులు పంచే గుణం కన్నా గొప్ప క్వాలిటీ ఇంకేం ఉంటుంది. ఎవరు ఎలాంటి మూడ్‌లో ఉన్నా సెట్ చేసేది కామెడీనే. ఈ నవంబర్ నుంచి అదే పనిలో ఉండబోతున్నారు అనిల్ రావిపూడి. కడుపుబ్బ నవ్వించే కామెడీ షో ‘కామెడీ స్టాక్ ఎక్సేంజ్’ త్వరలో ఆహాలో మొదలు కానుంది. ఎస్‌ఓఎల్ ప్రొడక్షన్స్ ఈ షోని తెరకెక్కిస్తోంది.
ఈ షో గురించి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, ”ప్రతిభావంతులైన నటులతో ‘కామెడీ స్టాక్ ఎక్సేంజ్’కి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఆద్యంతం నవ్వించే ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి సంతోషిస్తున్నారు. నా ఓటీటీ డెబ్యూ ఇది. ప్రేక్షకులందరూ ఆనందంగా ఆహ్వానిస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు. దీని గురించి నిర్వాహకులు వివరిస్తూ, ”’కామెడీ స్టాక్ ఎక్సేంజ్’ చాలా ప్రత్యేకమైంది. స్టేజీల మీద కామెడీ చేసి, ప్రేక్షకులకు తమవైన మాటలతో చక్కిలిగింతలు పెట్టి కడుపుబ్బ నవ్వించే వారికి పెద్ద పీట వేస్తుంది. ఇటీవల విడుదలైన మా ట్రైలర్‌కి విశేషమైన స్పందన వస్తోంది. వేణు, ముక్కు అవినాష్, సద్దాం, ఎక్స్ ప్రెస్ హరి, భాస్కర్, జ్ఞానేశ్వర్ వంటివాళ్లు చేసిన కామెడీ ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టడం ఖాయం. ఇప్పటిదాకా ప్రేక్షకులకు చూపించని కోణాన్ని పంచుకోవడానికి సిద్ధమవుతున్నారు ఈ సెలబ్రిటీలు. సుడిగాలి సుధీర్ ఈ షోతోనే ఓటీటీలో అడుగుపెడుతున్నారు” అని అన్నారు.
Also Read
తాజావార్తలు
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్‌లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!