Raja Yogam: సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘రాజయోగం’. రామ్ గణపతి దర్శకత్వంలో మణి లక్ష్మణ్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తుదిమెరుగులు దిద్దుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 9వ తేదీ విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా మూవీ టీజర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన యువ కథానాయకుడు విశ్వక్ సేన్ టీజర్ ను విడుదల చేసి యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత మణి లక్ష్మణ్ రావు మాట్లాడుతూ, ”ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగే చిత్రమిది. మా టీమ్ అందరికీ రాజయోగం తెస్తుందని ఆశిస్తున్నాం. రెండు గంటల పాటు ఇంటిల్లిపాదీ నవ్వుకునేలా సినిమా ఉంటుంది. మేము అనుకున్నట్లుగా ఔట్ పుట్ వచ్చింది” అని అన్నారు.
సంగీత దర్శకుడు అరుణ్ మురళీధరన్ మాట్లాడుతూ, ”నేను తెలుగులో పనిచేస్తున్న మొదటి సినిమా ఇది. ఇంతకు ముందు మలయాళంలో కొన్ని చిత్రాలకు సంగీతాన్ని అందించాను. ఈ సినిమాకు మంచి సంగీతాన్ని సమకూర్చే క్రమంలో దర్శకుడు రామ్ గణపతి కావాల్సిన ఎంకరేజ్ మెంట్ ఇచ్చారు. ఈ ఆల్బమ్ హిట్ అవుతుంది” అని చెప్పారు. హీరోయిన్ అంకిత సాహా మాట్లాడుతూ, ‘ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందని, ఈ పాత్ర తాను చేయగలనని నమ్మిన దర్శకుడు రామ్ గణపతి కృతజ్ఞతలు తెలుపుకుంటాన’ని అన్నారు. మరో హీరోయిన్ బిస్మి నాస్ మాట్లాడుతూ, ‘కేరళ నుండి వచ్చిన తనకు ఇదే మొదటి తెలుగు సినిమా అని చెప్పారు.
దర్శకుడు రామ్ గణపతి మాట్లాడుతూ, ”రొమాంటిక్ కామెడీ కథతో ఈ సినిమాను రూపొందించాను. ఈ సినిమాలో 100 నుంచి 150 దాకా లిప్ లాక్ సీన్స్ ఉంటాయి. ఫస్టాఫ్ లో వచ్చే లిఫ్ట్ సీన్ మిస్ కావొద్దు. సాయి రోనక్ పక్కింటి కుర్రాడి ఇమేజ్ తో ఇప్పటిదాకా కనిపిచాడు. కానీ మాస్ సబ్జెక్ట్ దొరికితే అతను మాస్ హీరో అవుతాడు. ఈ సినిమాలో అతని పర్మార్మెన్స్ సూపర్బ్. ఇద్దరు
హీరోయిన్స్ బాగా నటించారు. అంకిత క్యారెక్టర్ కొద్దిగా గ్రే షేడ్ లో ఉంటుంది. విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ, అరుణ్ మురళీధరన్ సంగీతం హైలైట్ అవుతాయి. ఈ సినిమాలోని ‘పడిందే…’ అనే స్పెషల్ సాంగ్ కు ఎం.ఎం. శ్రీలేఖ స్వరాలు సమకూర్చారు. థియేటర్ లో ఈ పాట దద్దరిల్లిపోతుంది” అని అన్నారు. హీరో సాయి రోనక్ మాట్లాడుతూ, ”మా సినిమాలో రొమాన్స్, కామెడీ, యాక్షన్ అన్నీ ఉంటాయి. ఒక డబుల్ మసాలా బిర్యానీ లాంటి సినిమా ఇది. నాకు ఇలాంటి సబ్జెక్ట్ దొరకడం లక్కీ. నాకు ఫైట్స్, డాన్స్ చేయడం ఇష్టం. ఆ అవకాశం ఇంతవరకు రాలేదు. ఈ సినిమాలో
డాన్స్, ఫైట్స్ ఎంజాయ్ చేస్తూ చేశా. రెండు గంటలు ఎంటర్ టైన్ అవుతారు” అని చెప్పారు.
అన్నారు.