Chiclets: యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే చిత్రాలను తీయడానికి దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు ఎం. ముత్తు ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నాడు. తమిళ చిత్రం ‘తిరంతిడు సీసే’తో దర్శకుడిగా పరిచయం కావడానికి ముందు ఎం. ముత్తు చిత్ర నిర్మాత శంకర్ తో పాటు శ్రీకాంత్ అడ్డాల దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఇప్పుడు అతను 2కె కిడ్స్ యువ శక్తిని వెండితెరపై చూపించబోతున్నాడు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘చీక్లెట్స్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ప్రమోషన్స్ ను మేకర్స్ మొదలు పెట్టారు. ఈ సందర్భంగా సెన్సిబుల్ మూవీస్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ‘చీక్లెట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసి టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
‘చీక్లెట్స్’ మూవీ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోందని, ప్రతిభావంతులైన యువ నటీనటులు సాత్విక్ వర్మ, జాక్ రాబిన్ కుమారుడు, బాల నటులుగా పనిచేసిన రజీమ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, నయన్ కరిష్మా, అమృత హల్దార్, మంజీర ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారని ఎం ముత్తు తెలిపారు. ఎస్.ఎస్.బి. ఫిల్మ్ బ్యానర్ పై శాంతి శ్రీనివాసన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌కి బాలమురళి బాలు సంగీతం అందిస్తున్నారు. కొలంచి కుమార్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, విజయ్ వేలుకుట్టి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. మనోబాల, శ్రీమన్, జానకి, సురేఖా వాణి, సంపత్ రామ్, మీనాల్, రాజగోపాల్ తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.