Bhediya: కృతి సనన్ ను ‘చిలిపి వరాలే ఇవ్వ’మంటున్న వరుణ్ ధావన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Dhawan: ఎన్నో సూపర్ హిట్ ఫిలిమ్స్ ను డిస్ట్రిబ్యూషన్ చేసిన గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ తాజాగా ఇప్పుడు హిందీ సినిమా ‘భేడియా’ తెలుగు డబ్బింగ్ వర్షన్ ‘తోడేలు’ను రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేయబోతోంది. ఈ నెల 25న మూవీ రిలీజ్ అవుతోంది. ఆ సందర్భంగా పబ్లిసిటీలో వేగం పెంచారు నిర్మాతలు. వరుణ్ ధావన్, కృతిసనన్ జంటగా నటించిన ఈ మూవీలో ఇప్పటికే ‘తుమ్కేశ్వరి’ అనే గీతం విడుదలై శ్రోతల నుండి ఆదరణ అందుకుంది. తాజాగా ఇప్పుడు ‘చిలిపి వరాలే ఇవ్వు’ అనే సాంగ్ ను అధికారికంగా లాంచ్ చేశారు. ఈ చిత్రానికి సచిన్ జిగర్ సంగీతం అందించగా, ఈ పాటను అమితాబ్ భట్టాచార్యతో కలిసి యనమండ్ర రామకృష్ణ రాశారు. ఈ ఫీల్ గుడ్ మెలోడీ సాంగ్ సైతం వ్యూవర్స్ ను ఆకట్టుకునేలా ఉంది.
2018 లో వచ్చిన ‘స్త్రీ’, 2021 లో వచ్చిన ‘రూహి’ తరువాత, దినేష్ విజన్ హారర్-కామెడీ జానర్ లో అమర్ కౌశిక్ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘భేడియా’. హిందీ, తమిళ, తెలుగు భాషల్లో ఇది 2డీ, 3డీ వర్షన్స్ లో విడుదల కాబోతోంది. ఇటీవలే ‘కాంతార’ను పంపిణీ చేసి పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అల్లు అరవింద్ విడుదల చేస్తున్న ‘తోడేలు’ మూవీ మీద కూడా సహజంగానే అంచనాలు పెరిగాయి.
Also Read
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-16 Live : కోటి దీపోత్సవంలో కపాలీశ్వర స్వామి కల్యాణం.. 16వ రోజు విశేషాలివే.!
-
Aus vs Eng: మిచెల్ మార్ష్ సెంచరీ వృథా.. 7 పరుగులతో గెలిచిన ఇంగ్లాండ్, సిరీస్ కైవసం..
-
Mohammad Kaif: సిరాజ్‌ను ఎందుకు తప్పించారు..? టీమ్ మేనేజ్మెంట్పై ఫైర్..
-
Gond Laddu: చలికాలంలో ఆడపిల్లలు, బాలింతలు తినాల్సిన ‘సూపర్ లడ్డూ’ ఇదే!
-
Old Silk Sarees : పాత పట్టు చీరల్లో బంగారం, వెండి.. ఎలా గుర్తించాలి.?
-
Kieron Pollard: ‘పాత్రలు మాత్రమే మారాయి, లక్ష్యం ఒక్కటే’.. రోహిత్ శర్మ రీఎంట్రీపై పొలార్డ్ రియాక్షన్..
ట్రెండింగ్
-
Rooftop Solar Net : ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఉన్నాయా?.. మిగులు యూనిట్లతో ఇక మరింత ఆదా.!
-
Car Bonnet Smoke : కారు బోనెట్ నుంచి పొగ.. వెంటనే చేయాల్సిన పనులివే.!
-
Eyeglass Lens Scratches : కళ్లద్దాలను చొక్కాతో తుడుస్తున్నారా?.. ఈ తప్పు అస్సలు చేయొద్దు.!
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్‌తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!