Meet Cute: నాని సోదరి ఆంథాలజీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani: నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన యాంథాలజీ ‘మీట్ క్యూట్’. దీనితో నాని సోదరి దీప్తి గంటా దర్శకురాలిగా పరిచయం అయ్యారు. దీని ట్రైలర్ ను శుక్రవారం విడుదల చేశారు. ఈ టీజర్ కు నాని వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. గతంలో వచ్చిన టీజర్ అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేసి రోలర్ కోస్టర్ ఎమోషన్ ని చూపించగా, ట్రైలర్ మరింతగా ఆకట్టుకుంది. ‘నీకు మీట్ క్యూట్ అంటే తెలుసా.. అనుకోకుండా ఇద్దరు పరిచయం లేని వ్యక్తులు మొదటిసారి కలిసినప్పుడు వాళ్ల మధ్య వచ్చే అందమైన పరిస్థితులు.. మాటలు.. ఆ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయి’ అనే నాని వాయిస్ ఓవర్‌తో ఇది ప్రారంభమైంది. కొన్ని అర్బన్ ప్రేమ కథలను, విభిన్న ప్రేమికుల మధ్య విభిన్న భావోద్వేగాలను ఈ ట్రైలర్ లో ఆవిష్కరించారు. ‘మనం ప్రేమించే వారితో, మనం ఇష్టపడే వాటి కోసం మాత్రమే గొడవ పడతాం’ అనే సందేశాన్ని ఈ యాంథాలజీ హృద్యంగా అందిస్తోంది.
”ఇందులో ప్రతి కథకు ప్రాముఖ్యత ఉంది. ఈ తరం యువతకు రిలవెంట్ గా ఉంటుంది. ఈ సిరీస్ లోని పెద్దలు రెండు తరాల మధ్య వారధిగా కనిపిస్తున్నారు. అన్ని రకాల భావోద్వేగాల సమ్మేళనంగా మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా ఈ సీరీస్ ను చిత్రీకరించాం” అని దీప్తి చెప్పారు. అందమైన విజువల్స్ తో పాటు సిరీస్ కు తగినట్లుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. దీనికి వసంత్ కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా, విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూర్చారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్ చేయగా.. గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ వర్క్ చేశారు. సత్యరాజ్ , రోహిణి మొల్లేటి , అదా శర్మ , వర్షా బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహాని శర్మ ,సునయన, సంచిత, అశ్విన్ కుమార్, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మసూర్య, రాజా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. యాంథాలజీ సోనీ లివ్ లో ఈ నెల 25న స్ట్రీమింగ్ కాబోతోంది.
Also Read
- Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
- Siva Karthikeyan : స్టార్ హీరోలు వదిలేసిన కథలతో శివకార్తీకేయన్ ప్రయోగాలు
- Nani: "ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం": మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
- Mohan Babu: "నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో"
తాజావార్తలు
-
Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
-
Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
-
IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
-
BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?